ప్రప్రథమ చౌక హరిత భవనం


Sat,October 6, 2018 01:09 AM

GREEN
హరిత భవనాలను నిర్మించాలంటే కొంత ఖర్చు ఎక్కువే అవుతుంది. అలాంటిది, అందుబాటు గృహాల విభాగంలో.. హరిత నిర్మాణాల్ని నిర్మించడమంటే మాటలు కాదు. ఖర్చుకు వెనుకాడకుండా దేశంలోనే ప్రప్రథమ హరిత భవనాన్ని ఓ సంస్థ కట్టేసింది. తన ప్రత్యేకతను చాటిచెప్పింది. దాదాపు 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 288 ఫ్లాట్లను విజయవంతంగా నిర్మించింది. గృహప్రవేశానికి సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. సహజమైన వెలుతురు ప్రతి ఫ్లాట్లలో వచ్చేస్తుంది. క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. వ్యర్థాలను సులువుగా విభజించే ప్రక్రియను అమలు చేసింది. వికలాంగులు సైతం సులువుగా తమ ఫ్లాట్లలోకి వెళ్లే ఏర్పాట్లు చేసింది. కామన్ లైటింగ్ కోసం సోలార్ ప్యానెళ్లను వినియోగించింది. మూడు అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం, పద్ధతి ప్రకారం నీటి సరఫరా, ఎల్‌ఈడీ లైట్ల వినియోగం వంటివి ప్రవేశపెట్టింది. దీంతో, దేశంలోనే ప్రప్రథమ అందుబాటు హరిత భవనంగా సావీ స్ట్రాటా ఖ్యాతినార్జించింది. ఈ ప్రాజెక్టు అహ్మదాబాద్‌లో సావీ సంస్థ నిర్మించింది. మన నిర్మాణ సంస్థలూ ఇదే తరహాలో అందుబాటు గృహాలను నిర్మిస్తే.. కొనుగోలుదారులకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు.

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles