లక్ష్యమే యువత రక్ష!


Tue,January 9, 2018 11:15 PM

యువతకు కాలక్షేపం చేయడమే తెలుసా? ఎంజాయ్‌మెంటే వాళ్ల లక్ష్యమా? పట్టుదలతో పనిచేసి ఆర్థికంగా.. సామాజికంగా ఎదుగడం.. పరిస్థితులను అధిగమించడం తెలుసని నిరూపించేవాళ్లూ ఉన్నారు. వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన శీతల్‌జైన్.
Sheetal-Jain
ఈమె యువతకు ఆరద్శంగా నిలుస్తున్నారు. వాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు. అన్నీ ఉన్నా ఏమీ చేయలేనివాళ్లను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ ఏమీ లేకున్నా.. తనతో ఎవరూ లేకున్నా శీతల్ లక్షాన్ని సాధించింది. తల్లి ఒక బార్ డ్యాన్సర్. పరిస్థితుల ప్రభావంతో అందులోకి బలవంతంగా అడుగుపెట్టిన మహిళ. ఆమెలా బార్ డ్యాన్సర్ పనిలోకి.. వ్యభిచార కూపంలోకి నెట్టబడ్డవాళ్లెంతో మంది ఉన్నారు. చిన్నప్పట్నుంచి ఈ పరిస్థితులన్నీ చూసి పెరిగింది శీతల్. తిండికీ.. చదువుకు చాలా ఇబ్బంది పడింది. అప్పుడే ఆమెలో ఒక పట్టుదల ఏర్పడింది. పరిస్థితిని చూసి కుంగిపోకుండా సంగీతంపై ఇష్టం ఏర్పరుచుకున్నది. బార్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న తన తల్లి నుంచి కూడా కొంత నైపుణ్యం వారసత్వంగా స్వీకరించింది. ఇప్పుడొకసారి శీతల్ జైన్ అనే యువతి ఫేమస్ ఇండియన్ డ్రమ్మర్‌గా పేరు సంపాదించింది. తన టాలెంట్‌తో అందర్నీ ఆకట్టుకుంటూ ఎంతోమంది పేద యువతీయువకులకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఆకలి.. పేదరికం ఏదీ ఉన్నా.. లక్ష్యమొక్కటి గట్టిగా ఉంటే కచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అంటున్నది!

240
Tags

More News

VIRAL NEWS