స్మార్ట్ ఆలోచన


Sat,September 15, 2018 01:02 AM

ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. అలాంటి ఆలోచనే బెంగళూరులోని సెయింట్ మాథ్యూవ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేశారు.
dustbins
బెంగళూరు నగరంలో పలుచోట్ల ఉన్న చెత్తను తొలగించేందకు ఆ విద్యార్థులు పరిష్కార మార్గాన్ని చూపారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాలలో ఉన్న చెత్తకుండీలలో పేరుకు పోయిన చెత్తను తొలగించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. చెత్త కుండీలలో వ్యర్థాలు నిండినా ఎప్పటికప్పుడు ఆయా సిబ్బంది తొలగించడం లేదు. దీంతో అటు చెత్త, ఇటు దుర్వాసన రెండు సమస్యలు తలెత్తులున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాలలో పేరుకు పోయిన చెత్తను తొలగించేందుకు స్మార్ట్‌గా ఆలోచించిన విద్యార్థులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. వ్యర్థాల సమస్య నుంచి సులువుగా గట్టెక్కేందుకు విద్యార్థులు జ్యోతిక, దివ్యసాయి ఇద్దరూ కలిసి టెక్నాలజీ సాయంతో స్మార్ట్ డస్ట్‌బిన్లు రూపొందించారు.

విద్యార్థులు రూపొందించిన ఓ వినూత్న పరికరాన్ని ఆయా ప్రాంతాలలో ఉండే డస్ట్ బిన్లకు అనుసంధానం చేసి అమర్చారు. తద్వారా చెత్తను తొలగించేందుకు సిద్ధమయ్యారు. డస్ట్‌బిన్‌లు నిండగానే రెడ్‌లైట్ వెలిగేలా ఈ పరికరాన్ని అమర్చారు. వారు రూపొందించిన ఈ పరికరంలో ఆయా సిబ్బందికీ, ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా సిమ్‌కార్డును నిక్షిప్తం చేశారు. అంతేకాదు డస్ట్‌బిన్‌లో కాకుండా బయట వేస్తే అలారం వచ్చేలా మరో ఫీచర్ కూడా ఉంది. చెత్త డబ్బాలకు ఆటోమేటిక్ సెన్సర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు వ్యర్థాలు నిండగానే సంబంధిత అధికారులకు, సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. వాళ్లు స్పందించి వెంటనే చెత్త తొలగిస్తే సరి.. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. చెత్త లేకపోతే.. అనారోగ్య సమస్యలు కూడా ఉండవు కదా! అందుకే మా ఈ చిరుప్రయత్నం అంటున్నారీ చిచ్చర పిడుగులు.

618
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles