విత్తనాల తల్లి!


Wed,September 26, 2018 01:19 AM

రకరకాల కూరగాయల విత్తనాలను భద్రంగా దాచిపెట్టేది. ఆమెను చూసి గ్రామస్థులు పాతకాలం మనిషని హేళన చేసేవారు. ఇప్పుడు 114 సంప్రదాయ పంటల విత్తనాలను సంరక్షిస్తున్న ఆమెను ప్రజలే విత్తనాల తల్లిగా భావిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఈమె?
seeds-mother
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన రహీబాయ్ పొపెరె. ఈమె ఇప్పటివరకు 114 సంప్రదాయ పంటల విత్తనాలను సంరక్షించారు. హైబ్రిడ్ వంగడాల వల్ల మనుషులు బలహీనంగా తయారవుతున్నారని, సంప్రదాయ విత్తనాల సంరక్షణను అభివృద్ధి చేయాలనుకున్నది. రకరకాల విత్తనాలను సేకరిస్తుంటే పాతకాలం మనిషని అందరూ హేళన చేసేవారు. రహీబాయ్ గ్రామస్థుల మాటలను పెడచెవిన పెట్టి అనుకున్నది నెరవేర్చాలనుకున్నది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని కూరగాయల పంటగా మార్చింది. ఆరోగ్యానికి ఉపయోగపడే 500 రకాల కూరగాయలను పండిస్తున్నది. వీటి పెరుగుదల కోసం రసాయనాలను వాడకుండా ప్రకృతి ఎరువులు మాత్రమే వాడుతున్నది. రాగులు, జొన్నలు లాంటి చిరుదాన్యాలు కనుమరుగయ్యాయని చెప్పుకొచ్చింది. విత్తనాలన్నింటిని ఒక గుడిసెలో దాచి విత్తనాల బ్యాంక్ అని చెప్పుతున్నది. మొదట్లో హేళన చేసిన ప్రజలే రహీబాయ్ పొపెరె చేస్తున్న పని ప్రాధాన్యాన్ని గుర్తించి విత్తనాల తల్లిగా ఆదరిస్తున్నారు.
seeds-mother1

1089
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles