నాణ్యమైన విద్య కోసం!


Sat,November 3, 2018 12:51 AM

గతంలో చదువుకోవాలంటే పుస్తకాలతోనే ఎక్కువగా అవసరం ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్, డిజిటల్ మీడియాలను ఉపయోగించుకొని విద్యార్థులు మరింత సులువుగా పాఠాలను అర్థం చేసుకునే సౌకర్యాలు వచ్చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ రియాలిటీ(వీర్) మాధ్యమం ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది ఓ అధికారిణి.

educaion
జార్ఖండ్ గోదా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమారి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఐఐటీలో డిగ్రీ చదివిన విద్యార్థులతోపాటు జిల్లాలోని 60 పాఠశాలలకు స్మార్ట్ క్లాస్‌లు చెబుతున్నారు. జీవితంలో జరిగే పలు సంఘటనలతోపాటు ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వర్చువల్ రియాలిటీ (వీర్) మాధ్యమాన్ని ఉపయోగించి అవగాహన కల్పిస్తున్నారు. కిరణ్‌కుమారి గతంలో బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బంకా జిల్లాలో పనిచేసేటప్పుడు ఇదేవిధంగా విద్యనందించి విజయవంతమైంది. అదే ప్రాజెక్టును ఇక్కడ కూడా అమలు చేస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నది. విద్యార్థులకు త్రీడీ క్లాసులు చెప్పేందుకు ఎకోవేషన్ జ్ఞానోదయ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వారు ఏడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ వర్చువల్ రియాలిటీ ఉపకరణాలను అందించి తద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ పోటీపరీక్షలకు, జేఈఈ,ఎన్‌ఈఈ పరీక్షలకు ఉపయోగపడేలా శిక్షణ ఇస్తున్నారు.

506
Tags

More News

VIRAL NEWS