ఆపిల్‌తో బరువు తగ్గండి!


Sat,October 20, 2018 11:01 PM

మీరు బరువు తగ్గడానికి ప్రయతిస్తున్నారా? ఏవేవో చేస్తూ.. సమయాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆపిల్ పండును ప్రయత్నించి బరువు తగ్గండి.
apple
రోజూ ఒక ఆపిల్‌ను తినడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మామూలు పండ్ల మాదిరిగా ఆపిల్స్‌లో కొవ్వు మూలకాలు ఉండవు. పైగా ఇది శరీరంలో కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడుతుంది. ఇది డిమోంటియానిని తగ్గించడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆపిల్‌లో విటమిన్ ఎ,సి,ఇ,కె, ఫోలెట్ వంటివి ఉంటాయి. రోజుకొకటి ఆపిల్ తింటే రక్తనాళాలు శుభ్రమవుతాయి. అలాగే జ్యూస్‌లు చేసుకొని తాగే బదులు కూరగాయలు, పండ్లను నమిలి తినాలి. తాజా చెరుకు రసం విషాలను హరిస్తుంది. కేక్, బిస్కెట్, బ్రెడ్, పిజ్జా వంటివి వెంటనే మానెయ్యాలి. బరువు తగ్గేందుకు వేరుశనగ, ఆవాలు, కొబ్బరి, నువ్వుల నూనెలు ఉత్తమమైనవి. అలాగే కొబ్బరి కూడా జీరో కొలెస్ట్రాల్ ఫుడ్. వీలైనంత ఎక్కువగా కొబ్బరిని వాడాలి. దోశలు, ఇడ్లీల్లో చట్నీగా కూడా వాడొచ్చు.

897
Tags

More News

VIRAL NEWS