ఆలివ్‌తో అందంగా!


Fri,October 19, 2018 11:00 PM

ఎండలో ఎక్కువగా తిరుగడం వల్ల చర్మం నల్లగా మారుతుంది. దుమ్ము, ధూళీ చర్మంపై పేరుకుపోవడం వల్ల మొటిమలు, రాషెస్ వచ్చే ప్రమాదమున్నది. వీటి నుంచి బయట పడేందుకే ఈ చిట్కాలు.

skin-care
-ఆలివ్ ఆయిల్, పాలు, దోసకాయ గుజ్జు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
-గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్‌లో కొంచెం నిమ్మరసాన్ని కలుపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం మెరుసిపోతుంది.
-ఆపిల్ సిడర్ వెనిగర్, ఆలివ్ ఆయిల్, నీటితో బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ఇలా తరుచూ చేస్తే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలిగిపోతాయి.
-ఆలివ్ ఆయిల్, కాస్టర్ ఆయిల్ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

782
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles