డయాలసిస్ తప్పదా?


Sat,May 26, 2018 01:50 AM

నా వయసు 50 సంవత్సరాలు. నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధ పడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. మా ఊరిలో డయాలసిస్ సెంటర్ లేదు. ప్రతి సారీ డయాలసిస్ కోసం దగ్గరలో టౌన్‌కు వెళ్లాల్సి వస్తున్నది. అందువల్ల చాలా అలసటగా ఉంటున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా డయాలసిస్ కాకుండా మరేదైనా మార్గం ఉంటే తెలియజేయగలరు.
సైదులు, ఇబ్రహీంపట్నం

tSkAM
క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధ పడుతున్నవారికి శాశ్వత చికిత్స కిడ్నీ మార్పిడి మాత్రమే. కానీ ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. లేదా కిడ్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి హాస్పిటల్‌లో చేసే డయాలసిస్ కంటే ఇంట్లో చేసుకునే డయాలసిస్ సౌకర్యంగా ఉంటుంది. ఇది చాలా సులభంగా చేసుకునే ప్రక్రియ. ప్రతిసారీ హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎప్పటి మాదిరిగానే మీరు రోజు వారీ పనులు చేసుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా హాస్పిటల్ డయాలసిస్‌తో పోలిస్తే తక్కువగానే అవుతుంది. రెగ్యులర్‌గా డయాలసిస్ చేసుకునే వారికి ఇతర మందులు కూడా తక్కువగా అవసరం అవుతాయి. కాబట్టి మీ డాక్టర్‌ను సంప్రదించి ఇంట్లో చేసుకునే డయాలసిస్ గురించి పూర్తిగా తెలుసుకొని ప్రయత్నించండి.

డాక్టర్ విక్రాంత్ రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

280
Tags

More News

VIRAL NEWS