సర్ఫింగ్ స్టార్ తన్వీ!


Sat,October 20, 2018 11:01 PM

అతి చిన్న వయసు నుంచే ఎంతో కష్టపడి కర్ణాటకకు చెందిన తన్వీ జగదీష్ సర్ఫింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నది. తల్లిండ్రుల ప్రోత్సాహంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభ చూపించి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ భారత దేశానికే వన్నెతెస్తున్నదీమె.
surf-star
తన్వీ జగదీష్‌కి 8యేండ్ల వయసు నుంచే వాటర్ గేమ్స్ అంటే ఆసక్తి ఉండేది. అందువల్ల ఆమె స్టాండప్ పాడ్లర్ ఆటపై మక్కువ పెంచుకొని ఇందులోనే రాణించడానికి ఎంతో శ్రమిస్తున్నది. తన్వీ తండ్రి జగదీష్ హిందుస్థాన్ పెట్రోలియంలో పనిచేస్తున్నాడు తల్లి కవిత గృహిణి. ఇటీవల తన్వీ అంతర్జాతీయ స్థాయి స్టాండప్ పాడ్లర్ పోటీల్లో పాల్గొని ఆరు పతకాలను సాధించింది. వచ్చే రెండు నెలల్లో ఆమె మరో రెండు అంతర్జాతీయ స్థాయి సర్ఫింగ్ పోటీల్లో పాల్గొననున్నది. అంతేకాదు నవంబర్ 17, 18తేదీలలో సింగపూర్ ఆసియన్ కప్-2018 గెలుచుకునేందుకు సన్నద్ధమవుతున్నది. అందరిలా కాకుండా తన్వీ తన జీవితాశయంగా ఈ రంగంలోనే రాణించాలని భావించింది. అందుకోసం రాత్రనక, పగలనక లక్ష్యం కోసం కృషి చేస్తున్నది.


ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి యోగా, ధ్యానంతోపాటు సర్ఫింగ్ ప్రాక్టీస్ చేస్తున్నది. రోజుకు 5 నుంచి 6గంటల పాటు కష్టపడుతున్నది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం ఉంటే మరిన్ని విజయాలు సాధిస్తానంటున్నది. భారతదేశం తరపున స్టాండప్ పాడ్లర్‌లో రాణించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆమెకు ఆర్థిక సాయమందించేందుకు దాతలు ముందుకు వస్తే వరల్డ్ కప్‌లో సైతం విజయం సాధించి చూపిస్తానని చెబుతున్నది. చదువులోనూ, కెరీర్‌లోనూ రాణించేందుకు అహర్నిశలూ కష్టపడుతున్నది. 2024సంవత్సరంలో జరుగబోయే స్టాండప్ పాడ్లింగ్ వరల్డ్ కప్ సాధించి తీరుతానంటున్నది.

769
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles