అందుబాటు గృహాలకే..


Sat,October 6, 2018 01:07 AM

దేశంలో పలు సంస్కరణల వల్ల నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఒక దశలో లగ్జరీ, వాణిజ్య నిర్మాణాల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిన నిర్మాణ సంస్థల ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అందుబాటు ధరల్లో ఇండ్ల నిర్మాణం చేసేందుకు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రధాన మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో పాటు, ప్రాత్సాహకాలను కారణంగా చెప్పుకోవచ్చు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2022 నాటికి అందరికి ఇండ్లు అనే నినాదంతో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
* సకాలంలో సరైన వడ్డీ వస్తుందనే కారణంతో కమర్షియల్, అందుబాటు గృహాలు, లాజిస్టిక్స్, గిడ్డంగుల నిర్మాణంపై ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు ఎక్కువ పెట్టాయి. 2011లో ఈ విభాగంలో పెట్టుబడులు 40 మిలియన్ డాలర్లు ఉంటే 2017 నాటికి 88 మిలియన్ డాలర్లకు చేరింది. 2018 మొదటి ఆరు నెలల్లో పెట్టుబడి 157 మిలియన్ డాలర్లకు చేరింది.

అధిక ప్రోత్సాహకాలు

2022 నాటికి అందిరికి ఇండ్లు అనే నినాదంతో పలు ప్రోత్సాహకాలను ఇస్తున్నది. ఈ తరహా గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్‌ను కల్పించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాలను విస్తరించింది. ఈ పథకం కింద రూ.2.60 లక్షల దాకా వడ్డీ రాయితీని అందజేస్తోంది.

416
Tags

More News

VIRAL NEWS