నూడుల్స్ ప్రమాదమే?


Mon,January 29, 2018 12:39 AM

నూడుల్స్.. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినే ఆహారం. రెడీమేడ్‌గా తక్కువ సమయంలో పూర్తయ్యే అహారంగా దీన్ని తీసుకుంటారు. మార్కెట్లో అనేక రకాల కంపెనీలకు చెందిన నూడుల్స్‌తో పాటు స్థానికంగా తయారయ్యేవి మార్కెట్లో లభిస్తున్నాయి. దీంతో చాలా మంది వాటిని ఇండ్లలోనే తయారు చేసుకుని మరీ తింటున్నారు. అయితే ఎలా తిన్నా, ఏ నూడుల్స్ తిన్నా అవి మన ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు వైద్యులు.
NOODLES
-అధిక బరువు సమస్యతో బాధపడే వారు నూడుల్స్ అస్సలు తినకూడదు. తింటే బరువు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే వీటిలో ఫైబర్ అస్సలు ఉండదు. నూడుల్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితా కిందకు వస్తాయి. కనుక వీటిని తింటే ఫైబర్ ఏ మాత్రం అందకపోగా వీటివల్ల మన శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. అది కొవ్వుగా మారి అధిక బరువుకు కారణమవుతుంది.
-నూడుల్స్ రెగ్యులర్‌గా తినే వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వస్తే శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేయలేదు. జీవక్రియలు మందగిస్తాయి. ఫలితంగా థైరాయిడ్ గ్రంథుల పనితీరుపై ప్రభావం పడుతుంది. బరువు పెరుగుతారు.
-నూడుల్స్‌ను మైదాతో తయారు చేస్తారు. అందువల్ల ఎలాంటి పోషకాలు ఉండవు. కనుక ఇది జంక్ ఫుడ్డే అవుతుంది. దీంతో నూడుల్స్ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగవు. ఒక వ్యర్థ పదార్థాన్ని తిన్నట్టే అవుతుంది.
-నూడుల్స్‌లో మన శరీరానికి చెడు చేసే కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బులను తెచ్చి పెడుతాయి.
-నూడుల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి అధిక మోతాదులో చేరితే ఫలితంగా బీపీ, తలనొప్పి, వికారం, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయి.
-నూడుల్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అది ఒంట్లో అధికంగా నీరు చేరేందుకు కారణమవుతుంది. దీంతో పాదాలు, చేతులు ఉబ్బినట్టు వాపులు వస్తాయి.
-నూడుల్స్ తిని ఇతర ఆహారాలు తింటే వాటిల్లో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా నూడుల్స్ అడ్డుకుంటాయి. దీంతో పోషకాహార లోపం వస్తుంది.
-గర్భిణీలు నూడుల్స్ అస్సలు తినకూడదు. తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

1086
Tags

More News

VIRAL NEWS

Featured Articles