మోమోగేమ్.. డెడ్లీగేమ్!


Tue,August 7, 2018 11:23 PM

ఆ మధ్య బ్లూవేల్ పేరుతో ఓ గేమ్ వచ్చి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నది. ఎన్నో చిన్నారి ప్రాణాలను హరించింది. ఈ గేమ్ మీద ప్రపంచ దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రాణాలు హరించే గేమ్ మోమో గేమ్ పేరుతో మరొకటి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గేమ్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
momo
వాట్సప్‌లో ఫేక్‌న్యూస్‌ల వల్ల మొన్నటి వరకు దేశవ్యాప్తంగా ఒక హాట్‌టాపిక్ నడిచింది. ఇప్పుడు తాజాగా మరో డేంజర్ గేమ్ వాట్సప్‌లో విస్తరిస్తూ ప్రాణాలు హరించేందుకు వస్తున్నది. ఈ ఆన్‌లైన్ గేమ్‌కు పక్షికళ్లు, మనిషి ముఖం కలిపి ఓ వికృత రూపాన్ని జత చేస్తారు. మోమో చాలెంజ్ పేరుతో వాట్సప్‌లో మెసేజ్ పంపిస్తారు. ఒక్కసారి ఈ గేమ్ లింక్‌కి రిైప్లె ఇస్తే చాలు.. రకరకాల గేమ్ చాలెంజ్‌లు, టాస్కులు ఇచ్చి మనల్ని మాయ చేస్తారు. వారు ఇచ్చే టాస్కులు, చాలెంజ్‌లు మొదట్లో ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగానూ ఉంటాయి. రాను రాను ప్రమాదకరంగా మారుతాయి. ఆత్మహత్యకు, హత్యకు ప్రేరేపించేలా ఈ గేమింగ్ యాప్ పురిగొల్పుతుంది. ఇప్పటికే ఈ గేమ్‌లో భాగంగా అర్జెంటినాలో వారం క్రితం ఓ అమ్మాయి చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు ఆమె ఫోన్ హ్యాక్ చేస్తే విషయం బయటపడింది. అర్జెంటీనా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ యాప్ ఇప్పటికే తీవ్రగా విస్తరించింది. పోలీసులు ఈ గేమ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మన దేశంలోకి ఇప్పటి వరకు ఇది ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ముందుగానే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా!

704
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles