దాచొద్దు.. బాధపడొద్దు!


Mon,February 19, 2018 01:33 AM

ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి, ప్రాణానికి రెండింటికీ నష్టం కలిగిస్తుంది. సానిటరీ నాప్‌కిన్స్‌ని ప్లాస్టిక్ కవర్‌లో పెడితే కానీ బయటికి కనిపించకుండా ఉంటుంది. అందమైన హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టాలంటే అదేదో అంటు వస్తువుగా భావిస్తారు. మరెలా?
Untitled-design
దాచొద్దు.. అస్సలు బాధపడొద్దు. అలాగని సమస్యను కొని తెచ్చుకోవద్దు. చాలా చోట్ల సానిటరీ నాప్‌కిన్స్ న్యూస్ పేపర్‌లో మలిచి నల్లటి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఎవరికీ కనబడకుండా ఇస్తారు. తెలిసి కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఈ విధంగా పెంచుతున్నారు. ఎందుకంటే అది బయటికి కనిపించొద్దు అంటే నల్లటి ప్లాస్టిక్ కవర్ మంచిదని అందరి భావన. ఆ ప్లాస్టిక్‌తో ఎంత నష్టం చేకూరుతుందో పట్టింపు ఉండదు. ఎందుకు సానిటరీ నాప్‌కిన్స్ మీ అందమైన హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టరు? అనే ప్రశ్న నుంచి మొదలైంది ఓ ప్రచార ఉద్యమం. డోంట్ హైడ్ ఇట్. పీరియడ్ పేరుతో సోషల్‌మీడియాలో లేవనెత్తిన ఓ అంశానికి విశేష స్పందన వస్తుంది. నేహా తుల్సైన్ ఈ ప్రచారానికి ఆజ్యం పోశారు. ప్రజల ఆలోచనా తీరు మారితే తప్ప ఇది సాధ్యం కాదని, అందుకోసం ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టినట్టు నేహా చెప్తున్నారు. సానిటరీ ప్యాడ్స్‌ని తీసుకెళ్లడం అదేదో చెడును తీసుకెళ్లిన భావన ఉన్నన్ని రోజులు మార్పు ఉండదని అంటున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలనుకుంటున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా ఎర్రటి పోల్కా చుక్కలతో ఉన్న తెల్లటి కాన్వాస్ బ్యాగ్‌లో ప్యాడ్స్ ప్యాక్ ఉంచుతున్నారు. ఇది ఈ ఏడాది జనవరి మాసంలో ప్రారంభం అయింది. వీళ్లు రూపొందించిన కాన్వాస్ బ్యాగ్‌లో పది ప్యాడ్స్ పడుతాయి. ప్రతీ ప్యాడ్ మీద సామాజిక ఉద్దేశంతో రాసిన సందేశం ఉంటుంది.

665
Tags

More News

VIRAL NEWS

Featured Articles