ప్రొఫెసర్ టీ స్టాల్


Sat,September 1, 2018 11:13 PM

జీతం అడిగినందుకు ఒక విద్యా సంస్థ యాజమాన్యం ప్రొఫెసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అలాగని ఆయన ఖాళీగా కూర్చోలేదు. బతుకడానికి అవసరమైతే టీ స్టాల్ పెట్టుకుంటా అని చాలెంజ్ చేయడమే కాదు టీస్టాల్ పెట్టి నడిపిస్తున్నాడు కూడా..
Tea_Web
పుణేకు చెందిన సింగ్నాడ్ ఇనిస్టిట్యూట్ టీచింగ్ స్టాఫ్‌కు, మేనేజ్‌మెంట్‌కు మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపులు తిరిగింది. ఈ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే తన్పూర్ మహేష్ టీస్టాల్ నడిపించాల్సి వస్తున్నది. దీనికి కారణం ఎంటెక్ డిగ్రీ హోల్డర్ అయిన మహేష్‌ను ఆయన ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తి కాకముందే ఈ ఏడాది జూన్ 14న విధుల నుంచి తొలగించింది. సింగ్నాడ్ కాలేజీ యాజమాన్యం గడచిన సంవత్సరంన్నరగా చాలామంది సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. ఆ సిబ్బంది సింగ్నాడ్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లో ప్రొహిబిషనర్‌లుగా పనిచేస్తున్నారు. అయితే వారిని సంవత్సరం తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్పి చేయకుండానే చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదు. జీతాలు అడిగినందుకు వారిని ఉద్యోగాలనుంచి తొలగించింది. వారంతా కోర్టును ఆశ్రయించారు.


దీంతో ఒకటి రెండు నెలల జీతాలు చెల్లించి చేతులు దులుపుకొంది. కానీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. దీంతో తన్పూర్ మహేష్ తనదైన ైస్టెల్లో నిరసనను తెలియజేయాలనుకున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమున్న మహేష్ తన కాళ్లమీద తాను నిలబడి గెలువాలనుకున్నాడు. ప్రయత్నించి ఓడిపోవాలి కానీ ప్రయత్నంలో ఓడిపోకూడదనుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆయన సోదరునితో కలసి గ్రామంలో నివసిస్తారు. భార్యతో కలిసి పుణేలో నివసిస్తున్న మహేష్ కుటుంబ సభ్యులంతా ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. దీంతో ఆయన తెలిసిన వారి దగ్గర కొంతమొత్తం అప్పుగా తీసుకొని టీస్టాల్ పెట్టి నడిపిస్తున్నాడు.

1407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles