గర్భిణులు ఏం తినొద్దు?


Mon,August 27, 2018 11:26 PM

స్త్రీ జీవితంలో గర్భదశ కీలమకమైంది. ఈ సమయంలోనే పలు మార్పులు జరుగుతాయి. చాలా జాగ్రత్తలు పాటించినా.. కానీ ఏం తినాలో? ఏం తినొద్దో తెలుసుకోరు. ఆ వివరాలే చదవండి.
Pregnancy
-చిక్కని జున్ను గర్భిణులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి చిక్కని జున్ను తినొద్దు. ఒకవేళ తిన్నట్లయితే అసౌకర్యానికి గురవుతారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది.
-పచ్చి మాంసం, పచ్చిగుడ్లు గర్భిణులు తింటే బలం అనుకుంటారు కొందరు. కానీ వీటిని తినడం వల్ల సాల్మోనెల్లా వ్యాధులు కలుగుతాయి. కేక్ బట్టర్.. ఐస్ క్రీమ్‌లు.. మాయో వంటివి తినొద్దు.
-గర్బిణులు పొప్పడి పండు తినొద్దు. ఒకవేళ మరిచిపోయి తింటే ప్రసవ సమయంలో అధిక రక్త స్రావం జరుగుతుంది. పొప్పడి పండు ఎక్కువ లాటేక్స్‌ను కలిగి ఉండటం వల్ల గర్భ సంకోచాలకు దారితీస్తుంది.
-గర్భంతో ఉన్నప్పుడు చక్కెర పదార్థాలు తినొద్దు.
-మాంసం కూడా విపరీతంగా తీసుకోవద్దు. మాసంలో ఎక్కువగా లిస్టిరియాసిస్‌లను కలిగించే కారకాలు ఉంటాయి. ఇవి గర్భాన్ని నిరోధించే పదార్థాలను కలిగి ఉంటాయి. శరీరంలో వేడిని 165 డిగ్రీల వరకు పెంచి హాని చేస్తాయి. కడుపులో పెరుగుతున్న శిశువుకు హాని కలిగిస్తాయి. గర్భ సమయంలో వీటికి దూరంగా ఉండటం మంచిది.
-పైనాఫిల్ తినకూడదు. దీనిలో ఉండే బ్రోమిలిన్ గర్భాశయంలో మార్పులు ఏర్పడేలా ప్రేరేపిస్తుంది. పండ్లు తినే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

185
Tags

More News

VIRAL NEWS