పోషకాహారం కోసం..


Sat,October 20, 2018 01:35 AM

జంక్ ఫుడ్‌కు అలవాటు పడి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఇవన్నీ లేనికాలంలో వంటింటి భోజనం తిన్న మన తాతముత్తాతలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారు ఎలాంటి పోషకాలు కలిగిన ఆహారం తిన్నారో తెలుసుకుందామా?
Nutrian-Collumn
-పసుపు క్యాన్సర్ కణాలతో పోరాడడంలో గొప్పగా పనిచేస్తుంది. అధిక మద్యపానం తీసుకోవడం వల్ల వచ్చే కీళ్ల, కాళ్ల నొప్పులను నివారించడంలో బాగా పనిచేస్తుంది. కాలెయాన్ని రక్షించడంలో గొప్ప సహాయకారి.
-కూరల్లో రంగు, రుచి, వాసన రావాలంటే ఇంగువా వెయ్యాల్సిందే. జీర్ణాశయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, జీర్ణ సంబంధి వ్యాధులకు ఇది చక్కని పరిష్కారం.
-జీలకర్ర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి, విష జ్వరాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కడుపు నొప్పి, అజీర్ణం, అతిసారం, వికారం, ఉదర సంబంధిత రోగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
-దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వాడొచ్చు. టైప్ 2 డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవాలి.
-గ్యాస్ట్రిక్ సమస్యలకు అల్లం దివ్య ఔషధం. గర్భధారణ సమయంలో వికారం, వాంతులను నివారించడానికి అల్లం వాడుతారు. క్యాన్సర్ రోగుల కీమోథెరపీకీ, ఉదర సంబంధిత రోగాలకు, విరేచనాలకు, కీళ్ల నొప్పులకు బాగా ఉపయోగపడుతుంది.
-అధిక రక్తపోటును నివారిండంలో వెల్లుల్లికి లేదు సాటి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా వెల్లుల్లి పోరాడుతుంది. జలుబును నివారించడంలో గొప్ప సహాయకారి.
-శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి నువ్వులు బాగా పనిచేస్తాయి. ఎముకల పటిష్టతకు సహాయపడుతాయి.

డాక్టర్ మయూరి ఆవుల
న్యూట్రిషియనిస్ట్
mayuri.trudiet@gmail.com

796
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles