పేదపిల్లల కోసం.. పెయింటింగ్!


Mon,July 17, 2017 12:48 AM

ఏడేళ్ల అమ్మాయి పేద పిల్లల చదువు కోసం తన పెయింటింగ్‌లను విక్రయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నది.
Sanjana
సంజన బోస్లే.. పెద్ద పెద్ద కళాకారులు సైతం ఆశ్చర్యపోయేలా పెయింటింగ్‌లు వేస్తున్నది. వాటిని ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చి అవి అమ్మతే వచ్చిన డబ్బులను పేదపిల్లల చదువు కోసం వినియోగిస్తున్నది. ఈ ఆలోచన సంజన చిట్టి బుర్రకు తట్టిందే కానీ దానికి బీజం వేసింది మాత్రం సంజన తల్లి. ఏదో మాటల సందర్భంలో పేద పిల్లల చదువు కోసం మనం ఏం చేయగలమని అడిగితే డబ్బులు ఇస్తే కొంత సహాయం చేసినవాళ్లం అమవుతామని చెప్పిందట. వెంటనే సంజన కిడ్డీ బ్యాంక్‌లోని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. ఒక ఎన్జీవోతో మాట్లాడి ఆ పెయింటింగ్‌లను అమ్మకానికి పెట్టించింది సంజన తల్లి. ఈ వయసులో ఉన్న పిల్లలెవరైనా తాము గీసిన వాటిని ఇతరులకు ఇవ్వడానికే ఇష్టపడరు. అలాంటిది సంజన ఇవ్వడమే కాదు.. వాటిని అమ్మితే వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఇవ్వనడం మాకు నచ్చింది. ఇక ముందు కూడా సంజనతో కలిసి పనిచేయడానికి మేం సిద్ధం అంటున్నది ఆ ఎన్జీవో!

270
Tags

More News

VIRAL NEWS