కారప్పొడి.. లాభాల ఒడి!


Sat,September 8, 2018 01:24 AM

ఇడ్లీ, దోశల్లోనూ కారప్పొడులను అత్యంత ఇష్టంగా ఆరగిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో దంచిన పొడులకు ఉండే టేస్ట్ వేరు. ఎందుకంటే, అవి పురాతన కాలం నుంచి వస్తున్న రుచికరమైన, వారసత్వ వంటకాలు కాబట్టి. మహిళఎవరూ వాటిని కాదనలేరు. ఆ ఆలోచనే ఈ మహిళకు కాసుల వర్షం కురిపిస్తున్నది.
grandmas-goodies
దక్షిణ భారతదేశంలో కారప్పొడులకు చాలా ప్రత్యేకత ఉంది. ఎంతోమంది కారప్పొడులను ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఆయా ప్రాంతాలను బట్టి వాటి తయారీలో, రుచిలో ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి వారసత్వ వంటకాలైన కారప్పొడులను మంచి నాణ్యతతో తయారు చేసి, దేశవ్యాప్తంగా విక్రయిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్న ఈ మహిళ పేరు సుకన్య సెల్వరాజ్. ఉండేది కోయంబత్తూర్‌లో. ఓ రోజు సుకన్య అత్త ఆమెను ఓ స్కూల్‌లో జరిగే కార్నివాల్‌కు తీసుకెళ్లింది. అక్కడ తాను సొంతంగా తయారు చేసిన కొన్ని రకాల కారప్పొడులు ప్రదర్శించి, విక్రయించింది. వాటిని రుచి చూసిన వారు సుకన్యను మెచ్చుకోవడంతో, ఎలాగైనా కారప్పొడుల వ్యాపారం చేయాలని నిర్ణయం తీసుకున్నది. నెమ్మదిగా తన అత్త, బామ్మల దగ్గర పలు రకాల కారప్పొడులు తయారు చేయడం, అవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే సహజ పద్ధతులను తెలుసుకున్నది. ప్రయోగాత్మకంగా కొన్నింటిని తయారు చేసి అమ్మి, లాభాలు సంపాదించింది. ఆ సమయంలోనే గ్రాండ్‌మాస్ గూడీస్ పేరుతో 46యేండ్ల వయసులో కారప్పొడుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా పాతకాలం నాటి రుచికరమైన కారప్పొడులను విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నది సుకన్య. కారప్పొడులు పరిమాణం పెరిగినా, నాణ్యత తగ్గకుండా మంచి మసాలా దినుసులు కలిపి అద్భుతంగా తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుకన్య తన ఉత్పత్తులను విక్రయిస్తున్నది. ఎటువంటి రసాయనాలు, రంగులు కలుపకుండా సహజంగా ఆమె రూపొందించిన పలు రకాల రెసిపీల కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. అంతే, కారప్పొడుల బామ్మగా ఒక్కసారిగా ఫేమస్ అయింది సుకన్య సెల్వరాజ్. ఆయా ఆర్డర్లును బట్టి నాలుగు కేజీల వరకూ కారప్పొడులను అందిస్తున్నది. ఇవి 4 నుంచి 8నెలల వరకూ చెడిపోకుండా ఉంటుండడంతో తమిళులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో పలురకాల పచ్చళ్లు, తొక్కులను వినియోగదారులకు అందించనున్నట్లు ఆమె వెల్లడించింది.

793
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles