రేడియేషన్ తగ్గించుకోండిలా!


Tue,January 9, 2018 11:24 PM

మొబైల్ వాడకం పెరిగిపోయిన నేటి రోజుల్లో రేడియేషన్ వల్ల అనేకమంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు పెరిగిన తర్వాత ఆ ఇబ్బందులు మరింత పెరిగాయి. అయితే ఈ రేడియేషన్ తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకోండి మరి!
radiation
-వీలైనంత వరకు ఫోన్ మాట్లాడే సమయంలో ఇయర్‌ఫోన్ వాడండి. లేదంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఇలా చేస్తే కొంతైన రేడియేషన్ ప్రభావం తగ్గించవచ్చు.
-ఫోన్‌లో సిగ్నల్ తక్కువున్న సమయంలో కానీ, చార్జింగ్‌తక్కువగా ఉన్న సమయంలో కానీ ఫోన్ మాట్లాడకండి. ఇలాంటి పరిస్థితుల్లో మామూలు కంటే ఎక్కువ రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది.
-ఫోన్ కంటే ఎక్కువగా మెసేజ్‌లు పంపడానికే మొగ్గు చూపండి. కొంతైనా రేడియేషన్ తగ్గించినవారవుతారు.
-డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ మాట్లాడొద్దు. ఇలా చేయడం వల్ల ఫ్రీక్వెన్సీ పవర్ ఎక్కువగా ఉండడమే కాక, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
-వీలైనంత వరకు రేడియేషన్ తక్కువగా విడుదల చేసే ఫీచర్ ఫోన్లు వాడడం రేడియేషన్ తగ్గించడానికి మరో మార్గం.
-స్మార్ట్‌ఫోన్ల కంటే ల్యాండ్‌లైన్ మొబైల్స్‌లో రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌కి బదులు ల్యాండ్‌లైన్ వాడండి.
-వీలైనంత వరకు మొబైల్‌ని శరీరానికి దూరంగా ఉండేలా చూసుకోండి.
-ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తిన తర్వాతనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకోండి. ఫోన్ ఆన్సర్ చేసేటప్పుడు వెలువడే రేడియేషన్ పదిరెట్లు అధికంగా ఉంటుంది.
-రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ తల పక్కన పెట్టుకొని పడుకోవడం మంచిది కాదు. రాత్రి సమయంలో రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుంటుంది.
-చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అస్సలు వాడకండి. సాధారణ సమయంలో కంటే చార్జింగ్ పెట్టినప్పుడు రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుంది.

1154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles