ముఖారవిందం కోసం


Sat,September 15, 2018 01:00 AM

lemon

విటమిన్ -సి చర్మాన్ని లోతుగా శుద్ధి చేయడంలో, చర్మ రంధ్రాల్లోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది అధికంగా ఉండే నిమ్మకాయలతో ఎలాంటి సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చునో చదువండి.
-తాజా నిమ్మరసంలో ఉప్పు కలుపాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు కలిపి ముఖం పై రాసి కొద్దిసేపు మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరువడంలో ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
-పైన చిట్కా స్క్రబ్బింగ్‌కి పనిచేస్తే.. ఈ చిట్కా టోనర్‌గా వాడుకోవచ్చు. నిమ్మరసంలో రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగిస్తే సరిపోతుంది.
-నిమ్మరసంలో పచ్చి పాలు కలిపి ముఖానికి రాయాలి. పదినిమిషాల తర్వాత వృత్తాకారంలో మర్దన చేస్తూ చల్లని నీటితో కడిగేయాలి. ఇది నల్లని మచ్చలను తొలిగించే క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది.
-దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. దీన్ని గ్రైండ్ చేయాలి. ఈ పొడిలో నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసి అరగంట పాటు పూర్తిగా పొడిబారే వరకు వదిలేయాలి.
-చర్మం మీద నిమ్మరసం పూసిన తర్వాత సూర్యరశ్మి తగులకుండా చూసుకోవాలి. ఫేషియల్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మరచిపోవద్దు.


గుమ్మడితో..


-మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకు రకరకాల రోగాలకు గుమ్మడి విత్తనాలు మంచి మందు.
-రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గించేందుకు గుమ్మడిలోని గుణాలు పనిచేస్తాయి.
-అందుకే చైనాలో గుమ్మడిని చక్కెరవ్యాధికి ఔషధంగా వాడుతున్నారు.
-ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించే గుణాలు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి.
-తరచూ గుమ్మడిని ఆహార పదార్థాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

362
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles