వెల్లుల్లి వాడి చూడండి!


Sat,August 18, 2018 01:27 AM

శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. ఈ సమస్య భారి నుంచి బయటపడేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంటాం. వెల్లుల్లితో ఒకసారి ప్రయత్నించి చూడండి... మంచి ఫలితం ఉంటుంది.
skincare_Wedding
-వెల్లుల్లిని మెత్తని పేస్టులా తయారుచేయాలి. కొంచెం సేపటి తర్వాత ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును కలుపాలి. తయారయిన పేస్టును చర్మం పొడిగా ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చర్మాన్ని నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
-వెల్లుల్లి పేస్టులో తేనె, రోజ్‌వాటర్‌ను వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారిన చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్‌ను రాయాలి.
-రోజ్‌వాటర్, అలోవెరా, ఆపిల్‌సిడర్ వెనిగర్, తేనె, అరటి, వేప, బియ్యపు పిండి కలిపి ముఖానికి రాయాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
-తరచూ నీరు తాగడం వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.
-గోరువెచ్చని నీటితో స్నానం చేస్తేం చర్మం పొడిగా మారకుండా ఉంటుంది.

446
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles