శనగపిండిలో ఉప్పు కలిపి..


Wed,September 19, 2018 12:56 AM

ముఖ అందాన్ని పెంచుకోవడానికి చాలా పద్ధతులను పాటించి ఉంటారు. మంచి ఫలితాలకోసం వీటిని వాడి చూడండి.
skincare
-పొప్పడి గుజ్జలో కొంచెం నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేస్తే చర్మంపై ఉన్న ముడతులు తొలిగిపోతాయి.
-పెరుగులో కొంచెం తేనె వేసి బాగా కలుపాలి. ఈ పేస్టును ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది.
-ఆలును చిన్న ముక్కలుగా చేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత శుభ్రపరుచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
-శనగపిండిలో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా ఉన్న ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
-కీరదోస రసాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా తరుచూ చేస్తే చర్మాని ఉపశమనంలభిస్తుంది.

896
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles