అపెండిక్స్ విలేజ్!


Sat,September 15, 2018 10:49 PM

అంటార్కిటికాలో ఓ వింత గ్రామం ఉంది. అక్కడ బతకాలంటే ఎవ్వరైనా కచ్చితంగా అపెండిక్స్(ఉండుకం) ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. లేకపోతే బతుకలేరు. ఒక్కోసారి ప్రాణాలమీదకు కూడా వస్తుంది. ఇక ఆడవారైతే గర్భం దాల్చొద్దు కూడా. ఎందుకో తెలుసా?
Oparation-Village
ఆ ఊరి పేరు విల్లాస్ లాస్ ఎస్ట్రెలాస్. ఆ ఊళ్లో ఒక పోస్టాఫీసు, స్కూల్, చర్చి, జనరల్ స్టోర్, బ్యాంకుతో పాటు మరికొన్ని మౌలిక వసతులు ఉన్నాయి. అయితే, ఆ ఊరికి దగ్గర్లో ఒక్క ఆస్పత్రి కూడా లేదు. ఆ ఊళ్లో కొందరు వైద్యులున్నా, ఎవ్వరికీ ఆపరేషన్ చేయడంలో నైపుణ్యం లేదు. మరీ.. ఎందుకు అంతా అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటున్నారనే కదా మీ డౌటు. ఎందుకంటే, అంటార్కిటికాలోని పెద్దాస్పత్రి ఆ గ్రామానికి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచుతో నిండిన దారుల గుండా అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే వైద్యం చేయడం సాధ్యం కాదు. అదే 24 గంటల కడుపునొప్పి(అపెండిసైటిస్) తలెత్తితే అది ప్రాణాంతకంగా మారొచ్చని స్థానికులు భావించారు. అందుకే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారంతా కచ్చితంగా ముందుగానే శస్త్రచికిత్స చేయించుకొని తమ ఉండుకాన్ని తొలగించుకోవాలనే నియమం పెట్టుకున్నారు. లాస్ ఎస్ట్రెలాస్ గ్రామంలో సగటు ఉష్ణోగ్రత మైనస్ 2.3 డిగ్రీలు. చలికాలంలో అది ఏకంగా మైనస్ 47 డిగ్రీల వరకూ చేరుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా ఆ గ్రామంలోని మహిళలు గర్భం దాల్చకపోవడమే మంచిదనుకుంటుంటారు.

581
Tags

More News

VIRAL NEWS