దివ్యాంగుల సేవలోనే!


Mon,November 5, 2018 02:15 AM

ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న జీవితం.. అనుకోకుండా ఓ కుదుపు. రెండేండ్ల చిన్నారికి జ్వరం. ఆస్పత్రికి తీసుకెళ్తే.. మానసిక వికలాంగురాలని తేలింది. ఆమెను బాగు చేసేందుకు ఆస్పత్రులకు తిరుగుతుంటే కొడుకుకు ప్రమాదరకమైన ముకోపాలిశాచరైడ్ అని తేలింది. ఈ విపత్కర పరిణామాలను గుండె ధైర్యంతో ఎదుర్కొన్న ఈ దంపతులు.. తమ పిల్లలతో పాటు దివ్యాంగులకు అండగా ఉంటున్నారు.
Tirupathi
తిరుపతికి చెందిన వరిజ, మధు దంపతులు దివ్యాంగ పిల్లల సేవలోనే తమ జీవితాన్ని గడుపుతున్నారు. చిన్న వయసులోనే కూతురు వర్షిణి మానసిక వికలాంగురాలవడం, కొద్దిరోజులకే కొడుకు శ్రీష్ ప్రమాదకర వ్యాధి బారిన పడడంతో ఎంతో కుంగిపోయారు. కొన్నాళ్లకు ధైర్యం తెచ్చుకొని తమలా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించారు. అలా 2010లో పేరెంట్స్ అసోసియేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్(పీఏసీ) ఏర్పాటు చేశారు. దీనిని శ్రీష్ మందిర్ పేరుతో పాఠశాలగా నడుపుతున్నారు. ఇందులో పిల్లలను ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీళ్లే బాధ్యతగా చూసుకుంటారు. వారికి చదువు చెప్పడంతో, ఆటలు, డ్రాయింగ్, పెయింటింగ్స్, సాంస్కృతిక విభాగాల్లో శిక్షణ ఇస్తారు. దివ్యాంగ పిల్లల్లో మనోవికాసాన్ని తెచ్చేందుకు భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేసి పూర్తిస్థాయిలో వారి కోసమే పనిచేస్తున్నారు. ఇందులో రెండేండ్ల పిల్లల నుంచి 38 సంవత్సరాల దివ్యాంగుల వరకూ ప్రవేశం కల్పిస్తారు. మొదట్లో దివ్యాంగుల కోసం పాఠశాల నడుపుతామని అటు ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మొరపెట్టుకున్నా ఎవ్వరూ స్పందించలేదు. దీంతో వారే సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నారు.

431
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles