కంటైనర్లలో స్కూల్స్!


Sat,October 13, 2018 11:36 PM

నిరుపయోగంగా ఉన్న ట్రక్ కంటైనర్లను ఏం చేస్తారు? సాధారణంగా ఏ ఇనుము తుక్కు కిందో జమ చేస్తారు. కానీ, ఒక మహిళ మాత్రం వాటితో నిరుపేద విద్యార్థులకు కొత్త జీవితాన్నిస్తున్నది. వాటిని కలర్‌ఫుల్ ఎయిర్ కండీషన్డ్ క్లాస్ రూములుగా మార్చి కంటైనర్ స్కూళ్లను నడుపుతున్నది.
divya-jai
ట్రైనింగ్, స్కిల్లింగ్, కన్సెల్టింగ్ రంగాల్లో సేవలందిస్తున్న సేఫ్‌డుకేట్ అనే సంస్థకు సహవ్యవస్థాపకురాలు, సీఈవో దివ్యజైన్. ఈమె 2015లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) సేఫ్‌డుకేట్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు మిలియన్ మంది విద్యార్థులకు ఉచిత విద్య, విజ్ఞానం అందుతున్నది. మూడేండ్లలో ఈ కంటైనర్ క్లాస్ రూముల్లో గ్రామీణ భారతంలోని టైర్-3 నగరాలకు చెందిన 20వేలమంది విద్యార్థులు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమ ఫలితాలను ప్రత్యక్షంగా గమనించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఎన్‌ఎస్‌డీసీలు దివ్య బృందాన్ని అభినందించాయి.
divya-jain1
షిప్‌యార్డ్‌ల నుంచి వీటిని సేకరించి అవసరాలకు అనుగుణంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. వాటితో క్లాస్‌రూములు, లాబొరేటరీలు, లైబ్రెరీలు, రెస్ట్‌రూములు, వసతిగృహాలు, ల్యాబ్‌లు, ఆఫీసులు, రిసెప్షన్‌లుగా మారుస్తున్నారు. సేఫ్‌డుకేట్ సంస్థ ఈ కంటైనర్లలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు హజరైన యువకులు, పిల్లలు తమ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లల్లో కూడా ఇన్ని సౌకర్యాలు లేవని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుకూలంగా లేని ప్రాంతాలు, అర్థిక వెసులుబాటు లేని ప్రాంతాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఈ కంటైనర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవ్వన్నీ పోర్టబుల్‌వి కావడం వల్ల కార్యక్రమం పూర్తవ్వగానే వాటిని విడదీసి మరో ప్రాంతానికి తీసుకెళ్లి వేరేచోట ఫిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటున్నాయి. ఒక భవనం నిర్మించడానికి అయ్యే ఖర్చుకంటే వీటికి అయ్యే ఖర్చు తక్కువ. సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండడంతో వీటికి సోలార్ విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. సేఫ్‌డుకేట్ సంస్థ బీహార్‌లోని చప్రా ప్రాంతంలో వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం కంటైనర్ స్కూల్ కన్సెప్ట్‌లో.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. స్కిల్ అనేది వారిని ఉద్యోగానికి సిద్ధం చేయడానికి కాదని, వారిని వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది అని దివ్య చెబుతున్నది.

750
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles