సంవత్సరంలో ఒక్కసారి!


Wed,October 17, 2018 12:37 AM

వృత్తి ఒకటి. ప్రవృతి మరొకటి ఉండొచ్చు. వృత్తిని వదిలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గణపతి, దుర్గా పూజల కోసం బొమ్మలు తయారు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నది రేష్మా.

durga-idol
కాటూ గణేష్ బొమ్మలు.. ఈ పేరు కొన్ని ఏరియాల్లో బాగా ఫేమస్. 71 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కార్ఖనాలో మొదటి ప్రతిమ 1947 ఆగస్టు 15న తయారు చేశారు. 35 సంవత్సరాల రేష్మా తండ్రి విజయ్ కాటూ ఆ విగ్రహాన్ని తయారు చేశాడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నదీమె. ఫిల్మ్ డైరెక్టింగ్‌లో డిప్లొమా చేస్తున్నది. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది. గతేడాది వరకు ఆమె ఈ బొమ్మల తయారీని మామూలుగానే చేసేది. కానీ ఈ సంవత్సరం తండ్రి మరణించాడు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విగ్రహాల తయారీని తాను చేయాలి. కస్టమైజ్డ్ విగ్రహాలను చేయడంలో వీరి కార్ఖానాకి మంచి పేరుంది. అందుకే వారి కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా విగ్రహాల తయారీ చేయిస్తున్నది. ఈ సంవత్సరం 200 గణపతి విగ్రహాలను, 88 దుర్గామాత విగ్రహాలను తయారు చేయించింది, చేసింది. నెలలో ఆ ఐదు రోజులు మాత్రం కార్ఖానాకి రాకుండా ఫోన్‌లోనే వర్కర్లకు సూచనలిస్తూ విగ్రహాల తయారీని సక్సెస్ చేసింది. తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకున్నది.

817
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles