వెన్నెల్లో వికసించే పూలు!


Sat,November 3, 2018 12:49 AM

రాత్రిపూట ఆరుబయట వెన్నెల్లో కూర్చొని సేదతీరుతున్నప్పుడు వికసించే పూలు పెరటిలో ఉంటే బాగుంటుందనుకుంటాం. రాత్రిపూట మాత్రమే వికసించే అలాంటి పూలు ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి.

flowers
-రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది కాబట్టి ఈ పువ్వులను క్వీన్ ఆఫ్ ది నైట్ అంటారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు వికసించే సమయంలో వచ్చే ఘాటైన పరిమళం మరే పువ్వు నుంచి రాదు.
-తెలుపు, ఊదారంగులో రాత్రిపూట వికసించే పూలను మూన్ ఫ్లవర్స్ అంటారు. వీటిని ఎక్కువగా పెండ్లిండ్లు, ఫంక్షన్‌లకు వినియోగిస్తుంటారు. తీగలతో అల్లుకుంటుంది కాబట్టి త్వరగా పెరుగుతుంది.
-రకరకాల రంగుల్లో వికసించే పూలను కొలంబినే అంటారు. ఇవి రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. వేసవికాలంలో మాత్రమే వికసించే ఈ పూలు గార్డెన్ మొత్తం సువాసనను వెదజల్లుతాయి. ఈ మొక్క చాలా పొడవుగా ఉంటుంది.
-పెద్దగా వికసించి ఉదయం వరకు ఉండే ఈ పువ్వును ఈవినింగ్ ప్రింరోజ్ అంటారు. ఇది పింక్ రంగులో ఉంటుంది. పువ్వు నుంచి వెలువడే పరిమళాలు ఎక్కువ సేపు ఉంటాయి. ఈ మొక్కను గార్డెన్‌లో పెంచడం చాలా సులభం.

714
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles