వృద్ధాప్యం హుష్‌కాకి


Wed,September 19, 2018 11:01 PM

వృద్ధాప్యానికి చెక్ పెట్టే కొత్త పరిశోధనను లండన్ సైంటిస్టులు కనుగొన్నారు. ముసలితనంలో వచ్చే జబ్బులు, సమస్యలకు ఇది పరిష్కారం కానుందని అంటున్నారు. ఇప్పటికే ప్రయోగాలు పూర్తయి, తుది దశకు చేరుకున్నాయంటున్నారు. ఆ కొత్త ఆవిష్కరణ ఏంటో చూద్దామా?
Blood
మలివయసులో వచ్చే సమస్యలను అధిగమించే పరిశోధనలో నిమగ్నమైన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సైంటిస్టులు కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. అదేంటంటే.. యువ రక్తాన్ని వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎక్కించడం. దీని ద్వారా ముసలితనంలో వచ్చే రోగాలకు చెక్ చెప్పొచ్చని, వారు కూడా యువకుల్లా ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా ముసలి ఎలుకలకు, యుక్తవయసులో ఉన్న ఎలుకల రక్తం ఎక్కించారు. ఆ తర్వాత వాటి ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఇలాంటి పరిశోధనలో బ్రిటన్ ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నది. మానవుల్లో రక్తమార్పిడి ద్వారా డిమెన్షియా, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అయితే, ఆరోగ్యాన్ని పరిరక్షించే రక్తకణాల కోసం మరిన్ని పరిశోధనలు చేయాలని లండన్ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిశోధన ఆధారంగా శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ ఇప్పటికే మానవులపై రక్తమార్పిడి ప్రయోగాలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పరిశోధన మెరుగైన ఫలితాలను ఇవ్వలేదని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రయోగంతో ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించే ఒక రహస్యం తెలిసినైట్లెంది.

1050
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles