వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు


Tue,January 16, 2018 11:06 PM

ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ టెక్నాలజీతో యూజర్స్‌ను అలరించే వాట్సాప్.. మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకువస్తున్నది. అవేంటంటే..
watsup

ఒకేసారి గ్రూప్ కాలింగ్:

ఇప్పటివరకూ వాట్సాప్‌లో ఒకసారి ఒక వ్యక్తితో మాత్రమే వాయిస్ లేదా వీడియోకాల్ మాట్లాడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏదైనా గ్రూప్‌లో వీడియోకాల్ చేయడం ద్వారా.. ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరితో ఒకేసారి వాయిస్ లేదా వీడియోకాల్ మాట్లాడుకోవచ్చు. ఒక విషయాన్ని స్నేహితులందరితో ఒకేసారి షేర్ చేసుకోవడానికి ఇది మంచి ఫీచర్. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నది.
wats-up2

క్విక్ స్విచ్:

వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న మరో అధునాతన ఫీచర్ ఇది. సాధారణంగా వాట్సాప్‌లో అవతలి వ్యక్తితో వాయిస్ కాల్‌తో మాట్లాడుతున్నప్పుడు, అదే సమయంలో వీడియో కాల్ మాట్లాడడం సాధ్యం కాదు. మాట్లాడుతున్న వాయిస్ కాల్‌ను కట్ చేసి, మళ్లీ వీడియో కాల్ చేయాలి. అయితే ఈ క్విక్ స్విచ్ వాయిస్ కాల్ మాట్లాడుతుండగానే, వీడియో కాల్‌లోకి వెళ్లిపోవచ్చు. స్క్రీన్‌పై వీడియోకాల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అవతలి వ్యక్తికి రిక్వెస్ట్ వెళుతుంది. ఆ వ్యక్తి అంగీకారం తెలిపితే.. మాట్లాడుతున్న వాయిస్‌కాల్, వీడియోకాల్‌గా కన్వర్ట్ అవుతుంది. లేదంటే వీడియోకాల్ కట్ అయిపోయి, వాయిస్‌కాల్ కొనసాగుతుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నది.
wats-upp

డిస్మిస్!

సాధారణంగా వాట్సాప్‌లో ఎంతమందైనా అడ్మిన్లుగా ఉండే సౌకర్యం ఉంది. ఇంతకు ముందైతే గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉన్న వ్యక్తిని బాధ్యతల నుంచి తప్పించాలనుకొంటే పూర్తిగా గ్రూప్ నుంచే తొలిగించాల్సి వచ్చేది. కావాలనుకొంటే మళ్లీ ఆ వ్యక్తిని గ్రూప్‌లోకి కొత్తగా చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్‌తో ఒక అడ్మిన్‌ను పూర్తిగా గ్రూప్ నుంచి తొలిగించకుండా, గ్రూప్ అడ్మిన్‌గా మాత్రమే తొలిగించే వెసులుబాటు ఉంటుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. ఈ డిస్మిస్ ఆప్షన్‌ను ఎలా ఉపయోగించాలనే విషయాన్ని స్క్రీన్ షాట్ ద్వారా ఇన్ఫోషేర్ చేసింది వాట్సాప్. అయితే ఈ ఫీచర్‌ను వాడుకోదలచినవారు కచ్చితంగా గ్రూప్ అడ్మిన్ అయి ఉండాలి.

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles