ప్ల్లాట్లకు పెరిగిన గిరాకీ


Sat,September 29, 2018 12:14 AM

నమస్తే సంపదతోఅశోకా డెవలపర్స్ ఎండీ జైవీర్‌రెడ్డి
jv-reddy
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా.. హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్లకు గిరాకీ పెరిగిందని అశోకా బిల్డర్స్ ఎండీ ఎన్. జైవీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శంకర్‌పల్లిలో సంస్థ అభివృద్ధి చేసిన అశోకా సెంట్రల్ పార్కుకు క్రిసిల్ ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిన సందర్భంగా ఆయన నమస్తే సంపదతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశంలోని తృతీయ శ్రేణీ పట్టణాలతో పోల్చినా.. భాగ్యనగరంలో ఇండ్ల ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక్కడి స్థలాల ధరలతో పోల్చితే విశాఖపట్నంలో నేటికీ తక్కువగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ, అక్కడ ఫ్లాట్ల ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయని చెప్పారు. కొత్త ఉద్యోగులైనా.. పదవీవిరమణ చేసినవారైనా.. హైదరాబాద్‌లోనే స్థిరపడటానికి మక్కువ చూపిస్తున్నారని చెప్పారు. ఇక్కడి అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలే ఇందుకు ప్రధాన కారణమన్నారు.

-మెట్రో రైలు ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట్ వరకూ ఆరంభం కావడం మధ్యతరగతి ప్రజలకెంతో ఉపయోగపడుతుంది. డిసెంబరుకల్లా మాదాపూర్ మెట్రో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో, పశ్చిమ హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనలేనివారు.. ఎల్‌బీనగర్ నుంచి హయత్ నగర్ దాకా స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులేస్తారు. పశ్చిమ హైదరాబాద్‌లో రూ.70 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనలేనివారు.. మెట్రో రైలు పుణ్యాన ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాల్లో రూ.40 లక్షలకే టూ బెడ్రూమ్‌లు కొంటారని చెప్పారు. రెరా వల్ల నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుంది. ఇక నుంచి ఎకరాల్లో ప్రాజెక్టులను చేపట్టే డెవలపర్లు.. వాస్తవిక పరిస్థితులను అంచనా వేసుకుని.. ప్రాజెక్టు పూర్తి చేసే గడువును తెలియజేయాలి. బడా ప్రాజెక్టుల్ని మూడేండ్లలో పూర్తి చేయడం కష్టమవుతుందనే విషయాన్ని బిల్డర్లు గ్రహించాలి.

-రాష్ట్రంలో జరిగే ఎన్నికల వల్ల నిర్మాణ రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. అందుకే, కొనుగోలుదారులు పండగ రోజుల్లోనూ ఫ్లాట్లను కొంటున్నారు. కొంపల్లిలో మేం చేపట్టిన ఆ-ల-మైసన్ ప్రాజెక్టుకు మెదక్, నిజామాబాద్‌లకు చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు. శంకర్‌పల్లిలో చేపట్టిన వెంచర్ అమ్మకాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇందులో క్లబ్‌హౌస్‌ని నిర్మిస్తున్నాం. నాలుగు విల్లాలనూ కడుతున్నాం.
jv-reddy1
jv-reddy2

684
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles