తప్పుల్లేని దరఖాస్తు.. ఇలా!


Sat,September 15, 2018 12:57 AM

రెండు వారాల క్రితం ఆరంభమైన రెరా విభాగంలో అధిక శాతం నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోవడానికి ముందుకొస్తున్నాయని రెరా మెంబర్ సెక్రెటరీ కె.విద్యాధర్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో నమోదుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవాలంటే రెరాలో రిజిస్టర్ తప్పకుండా అవ్వాలని వీరంతా భావిస్తున్నట్లుగా ఉందన్నారు. అయితే, రెరాలో కొత్త ప్రాజెక్టులు లేదా ఏజెంట్లు నమోదు చేసుకునేటప్పుడు.. పలు తప్పులు చేస్తున్నారని తెలిపారు. అవి పునరావృతం కాకుండా ఉండటానికేం చేయాలో రెరా మెంబర్ సెక్రెటరీ నమస్తే సంపదకు ప్రత్యేకంగా వివరించారు.
TSRERA

మరి, ఆ విశేషాలేమిటంటే..

-రెరాకు దరఖాస్తు చేసేవారు.. ఫైలు సైజు పెరిగితే ఏం చేయాలని తరుచూ అడుగుతున్నారు. కొన్ని నిర్మాణ సంస్థలు డాక్యుమెంట్ సైజును ఐదు ఎంబీ కంటే ఎక్కువ ఉన్నవి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా ఎట్టి పరిస్థితిల్లో చేయకూడదు. ఒకవేళ ఫైలు సైజు ఐదు ఎంబీ కంటే ఎక్కువుంటే.. రిసొల్యూషన్‌ను తగ్గించుకుంటే ఫైలు సైజు ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది. కాకపోతే, ఫైలు చదవడానికి వీలుండేలా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అప్‌లోడ్ చేయాల్సిన పేజీలు నాలుగైదు ఉంటే గనక.. ఒక్కో పేజీ సైజును 5 ఎంబీ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఐదు పేజీలున్నా.. మొత్తం ఐదు ఎంబీ కంటే తక్కువుంటే చాలు.

-రెరా సైటులో అప్‌లోడ్ చేసే ప్రతి డాక్యుమెంటును సెల్ఫ్ అటెస్ట్ చేయాలా? అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ డాక్యుమెంట్లకు సెల్ఫ్ అటెస్టేషన్ అక్కర్లేదని గుర్తుంచుకోవాలి. మరి, వేటికి అవసరమంటే.. పాన్ కార్డు, లీగల్ టైటిల్ డీడ్, అడ్రెస్ ప్రూఫ్ (ఏజెంట్లు), లెటర్ హెడ్ కాపీ (ఏజెంట్లు), అమ్మకపు రశీదు (ఏజెంటు) వంటివాటికే అవసరం ఉంటుందని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.
-ఒక గేటెడ్ కమ్యూనిటీలో 75 డ్యూప్లేలు ఉన్నాయని.. వాటిని ఎలా నమోదు చేసుకోవాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రతి డ్యూప్లే ఒక బిల్డింగ్‌గా గుర్తిస్తారు. అంటే, 75 భవనాల వివరాలు దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. కాకపోతే, డ్యూప్లేలు 75 ఉన్నప్పటికీ, వాటన్నింటినీ ఒకే ప్రాజెక్టుగా గుర్తిస్తామని మర్చిపోవద్దు.

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles