కాంతివంతమైన చర్మానికి!


Sat,September 8, 2018 01:22 AM

అందంగా తయారవడానికి ప్రతిరోజూ ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం. కానీ, అతి తక్కువ సమయంలోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి బేకింగ్‌సోడా, తేనె సరిపోతుంది. వీటితో చేసే ప్యాక్ మీ ముఖాన్ని ఫ్రెష్‌గానూ, కాంతివంతంగానూ మారుస్తుంది.
baking
-ఆలివ్ నూనె, తేనెను బాగా కలుపాలి. అందులో కొంచెం బేకింగ్ సోడాని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై ఐప్లె చేయాలి. మూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. చర్మం జిడ్డుగా అనిపిస్తే టోనర్‌ను రాసుకోవాలి.
-బేకింగ్ సోడా చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలిగిస్తుంది. ఇన్ఫెక్షన్, ఎర్రబారడం నుంచి కాపాడుతుంది. మొటిమలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.
-ఆలివ్ ఆయిల్ వల్ల శరీరం కాంతివంతంగా మృదువుగా అయ్యేందుకు దోహదపడుతుంది. చర్మ కణాలను బాగు చేయడమే కాకుండా నిర్జీవ కణాలను తొలిగిస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.
-తేనె చర్మానికి బ్లీచింగ్ చేయడానికి, కాంప్లెక్సేషన్ బాగు పడేందుకు సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయడానికి తేనె ఎంతో ఉపయోగపడుతుంది.
-ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ప్రయత్నించడం వల్ల ముఖంలో మార్పును గమనించవచ్చు.

262
Tags

More News

VIRAL NEWS

Featured Articles