చూడముచ్చటగా చిన్నారులు!


Sat,June 2, 2018 01:54 AM

పిల్లలంటేనే ముద్దుగా ఉంటారు. బుడి బుడి నడకలతో, చిట్టి పొట్టి మాటలతో.. బుజ్జాయిలు నడయాడుతుంటే.. ఆ ఇల్లు ఇక నందనవనమే!వాళ్లు మరింత ముద్దు వచ్చేలా డ్రెస్ వేస్తే చూడడానికి రెండు కళ్లూ చాలవు. అలాంటి బుజ్జి పాపాయిలకు.. చూడముచ్చటైన గౌన్ల కలెక్షన్‌ని తీసుకొచ్చాం..
Fashan
1. ఎప్పుడూ ఒకేలా కాకుండా జెమ్‌సూట్‌లో పిల్లలని చూడండి. ఎంత ముద్దొస్తారో! యెల్లో కలర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో 3/4 ప్యాటర్న్‌లో ఈ డ్రెస్ డిజైన్ చేశాం. నెక్‌లైన్, కాళ్ల దగ్గర ఎలాస్టిక్‌తో చిన్న చిన్న కుచ్చుల్లాగా కుట్టాం. రెండు వైపులా పాకెట్స్ ఇచ్చాం. నడుము దగ్గర చిన్న బౌ, షోల్డర్ దగ్గర టై చేసుకోవడానికి పట్టీలు ఇవ్వడం డ్రెస్ అందాన్ని పెంచింది.

2. చక్కనమ్మకు ఎలాంటి డ్రెస్ వేసినా బాగుంటుంది. నల్లని ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. దీన్ని గౌనుగా కుట్టాం. సింపుల్ నెక్‌లైన్ ఇచ్చాం. మెగా స్లీవ్స్‌ని రెండు లేయర్లుగా కుట్టడంతో మరింత ముద్దుగా కనిపిస్తున్నది. పీచ్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో అందమైన ఫ్లవర్‌లా డ్రెస్ మీద కుట్టడం వల్ల అదనపు ఆకర్షణగా నిలిచింది.

3. గోధుమ రంగు ప్రింటెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో ఈ డ్రెస్‌ని కుట్టాం. కాంట్రాస్ట్ కలర్‌లు అయిన ఎరుపు, ఆకుపచ్చ ప్రింట్ రావడం డ్రెస్ అందాన్ని మరింత పెంచింది. నెక్ లైన్, కింది వైపు గోధుమ రంగు ప్లెయిన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని కుచ్చుల్లా కుట్టాం. వెనుక వైపు ఒక బౌ ఈ డ్రెస్ అందాన్ని రెట్టింపు చేసింది.

4. పింక్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని గౌనుగా కుట్టడానికి ఎంచుకున్నాం. దీని మీద కార్టూన్ క్యారెక్టర్స్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. లో అండ్ హై మోడల్‌లో ఈ గౌన్‌ని డిజైన్ చేశాం. నెక్‌లైన్‌ని వెనుక డోరీలాగా ఇచ్చాం. నడుము దగ్గర లూప్స్ ఇచ్చి.. నల్లని సిల్క్ ఫ్యాబ్రిక్‌తో వదులుగా, బిగుతుగా చేసుకునేలా డోరీ జత చేశాం. ఇది పూర్తిగా ఇండో వెస్ట్రన్ ైస్టెల్‌తో డిజైన్ చేశాం.

రితీషా సతీష్‌రెడ్డి
ఈశా డిజైనర్ హౌస్
సుచిత్రా, హైదరాబాద్
ఫోన్ : 8500767476
https://www.facebook.com/
eshadesignerworks/

790
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles