లక్ష్యాన్ని మార్చుకొని..


Mon,January 22, 2018 12:39 AM

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రజలకు సేవ చేసే పెద్ద ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంటారు. ఈమె కూడా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కలలు కన్నది. ఆ దిశగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ.. ఉన్నపళంగా తన లక్ష్యాన్ని మార్చుకొని.. చివరికి సాధించింది.
Mittal-Patel
గుజరాత్ రాష్ట్రంలోని శంఖల్పూర్ గ్రామానికి చెందిన మిట్టల్ పటేల్ చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఉన్నత చదువులు పూర్తి చేసి అహ్మదాబాద్‌లో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటుండగా అనూహ్యంగా తన లక్ష్యాన్ని మార్చుకొని గిరిజనులకు సేవ చేస్తున్నది. శిక్షణ తీసుకుంటున్న సమయంలో చర్ఖా అనే ప్రాంతంలో చెరుకు కార్మికులను చూసేందుకు వెళ్లింది. వారంతా గిరిజన తెగకు చెందినవారు కావడం, చదువు లేకపోవడంతో కాంట్రాక్టర్లు వారిని దోపిడీ చేస్తున్న తీరు, నేరాలకు అలవాటుపడి అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూసి చలించింది. వారి కోసం జనపథ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి పిల్లలకు, మహిళలకు చదువు చెప్పించింది. వారిని చైతన్యపరుస్తూ 1871 క్రిమినల్ ట్రైబల్ చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నది. గిరిజన తెగలు వలసపోకుండా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టింది. అందరికీ రేషన్‌కార్డులు, గుర్తింపు కార్డులు వచ్చేలా పోరాడింది. మొత్తంగా నేరస్తులుగా ఉన్న గిరిజనుల జీవిన విధానంలో మార్పులు తీసుకొచ్చి.. ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకొన్నది మిట్టల్ పటేల్.

477
Tags

More News

VIRAL NEWS