కుటుంబాన్ని నిలబెట్టింది!


Sat,September 15, 2018 12:55 AM

Deepa-Gujar

ఆమె పేరు దీపా గుజార్. పేదరికం ఆమెను బాల కార్మికురాలిగా మార్చేసింది. ఆమె చిన్నతనంలోనే వాళ్ల నాన్న చనిపోయాడు. దీపకు ఆరుగురు అక్కాచెల్లెండ్లు, ఇద్దరు అన్నదమ్ములు. తల్లి గృహిణి. కుటుంబ భారం తల్లిపై పడడంతో ఏదో ఒక పని చేసేది. కూలీ పనిచేస్తే వచ్చే డబ్బులతో పూట గడవడం కష్టంగా మారింది.

ఏదో ఒక రకంగా పిల్లలకు తిండైతే పెడుతుంది కానీ.. వాళ్లను చదివించడం ఆమె వల్ల కాలేదు. దీంతో పిల్లలను పనికి పంపక తప్పలేదు. ఇలా కుటుంబ దీన పరిస్థితి వల్ల దీపా గుజార్ బాలకార్మికురాలిగా పనిచేసింది. తెలిసిన వాళ్లింట్లో పని చేసుకుంటూ వాళ్లిచ్చిన డబ్బుతో ట్యూషన్‌కు వెళ్లేది. తన పరిస్థితేంటో తనకు తెలుసు కాబట్టి చదువు కోసం చాలా కష్టపడేది. ఆమె కష్టాన్ని దగ్గరగా చూసిన ఒకతను ఓ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పెట్టించాడు. అలా నెలకు రూ.3000 వచ్చేవి. వాటితో కుటుంబ అవసరాలు తీర్చేది. హాస్పిటల్‌లో పనిచేసే ఒకరు డిజిటల్ అక్షరాభ్యాసం గురించి దీపకు వివరించారు. అలా కోడ్ ఉన్నతి ప్రోగ్రాం గురించి తెలిసింది. ఇది ఒక స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్. అక్కడే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ వంటి అప్లికేషన్స్ నేర్చుకొని కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం పొందింది. ఇప్పుడు ఆమె నెల జీతం రూ.7000. తనతోపాటు అక్కాచెల్లెండ్లకు కూడా ఉద్యోగం చూసింది. అందరూ కష్టపడి ఆర్థికంగా లదొక్కుకుంటున్నారు. బాల కార్మికురాలిగా పనిచేసిన దీప ఇప్పుడు డిజిటల్ ప్రోగ్రామింగ్‌లో టీమ్ లీడర్‌గా చేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నది.

139
Tags

More News

VIRAL NEWS