రోడ్డెక్కారు..రచ్చ చేశారు!


Wed,January 17, 2018 01:25 AM

ఫ్లాష్‌మాబ్ ఎక్కడ చేస్తారు? ఏ షాపింగ్ మాల్‌లోనో, ఏదైనా కాలేజ్ ఈవెంట్లోనో చేస్తారు. ఈ అమ్మాయిలు ఏకంగా రోడ్డుమీద చేసేశారు. ఎక్కడ? ఎవరా అమ్మాయిలు?
FLASH
ఏడ జాగ లేనట్టు.. ఈ అమ్మాయిలు రోడ్డు మీద ఫ్లాష్‌మాబ్ చేశారు. రోడ్డు బ్లాక్ చేశారు. ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారు. మంగళూరు సెయింట్ అగ్నేస్ కాలేజ్ 100వ వార్షికోత్సవం సందర్భరంగా అమ్మాయిలు ఫ్లాష్‌మాబ్‌కు ప్లాన్ చేసుకున్నారు. ఎక్కువమందిని ఆకట్టుకోవాలనే ఆలోచనతో రద్దీ ఉండే ప్రదేశంలో చేయాలనుకున్నారు. మెయిన్ రోడ్డు మీద గంటసేపు డ్యాన్సులు చేసి హంగామా చేశారు. రోడ్డు ఎక్కి రచ్చ చేశారు. ట్రాఫిక్ అంతా స్తంభించిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ క్లియర్ చేసి అందరినీ పంపించారు. పబ్లిసిటీ కోసం రోడ్డెక్కిన అమ్మాయిలను, కాలేజ్ యాజమాన్యాన్ని పోలీసులు మందలించారు. ఈ విషయంపై చాలామంది స్పందించారు. కొందరు దీన్ని పూర్తిగా వ్యతిరేకించగా, ఇంకొందరు మద్దతు తెలిపారు. ఏదైనా హద్దులు మీరకుండా, అతిక్రమణలకు పోకుండా చేస్తే బాగుంటుందని మరికొందరు హెచ్చరించారు.

947
Tags

More News

VIRAL NEWS