ఇంద్రధనుస్సు పళ్లు!


Sat,November 3, 2018 11:44 PM

పొద్దున మనమూ లేవాలి.. పళ్లను బాగా తోమాలని చిన్నప్పుడు పాడుకున్నాం. పెద్దయ్యాక కూడా పళ్లు తెల్లగా తళతళ మెరిపించేందుకు నానా తంటాలు పడుతుంటాం. అయితే పళ్లను కూడా రంగురంగులతో నింపేలా బ్యూటీ ట్రెండ్ ఇప్పుడు పాపులర్ అయింది.
teeth
రోజుకో బ్యూటీ ట్రెండ్ మారడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఔరా అనిపిస్తే.. మరికొన్ని ఛీ ఇవీ ఒక ట్రెండా? అనిపిస్తాయి. అది మనం చూసే కోణాన్ని బట్టి ఉందనుకోండి. కాస్త దాన్ని పక్కకు నెట్టి.. ఇప్పుడు మొదలైన ఈ ట్రెండ్ ఏ కేటగిరీలోకి వస్తుందో మీరే చెప్పండి. మనం ఇప్పటిదాకా గోళ్లకు రంగులు వేసి ముచ్చటపడ్డాం. అన్ని గోళ్లకు ఒకే రంగు, లేకపోతే ఒక్కో గోరుకు ఒక్కో రంగు చొప్పున వేసి ఆనందపడ్డాం. అయితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలై కుర్రకారును పిచ్చేక్కిస్తుంది. మరి.. ఈ రంగులు ఎక్కడ దొరుకుతాయనే సందేహం వచ్చింది కదా! ఇవి లిప్‌స్టిక్‌లు కాదు.. క్రోమ్ అనే ఒక కంపెనీ అచ్చు నెయిల్‌పాలిష్‌లా ఉండే పెయింట్‌లను అమ్ముతున్నది. ఇవి కేవలం పళ్ల కోసమే తయారు చేశారట. ముందుగా ఇంగ్లిష్ రాపర్ ఈ ట్రెండ్‌ని మొదలుపెట్టాడట. ఇక అప్పటి నుంచి ఈ ట్రెండ్ మరింత పాపులరయింది. మీకూ ఈ ట్రెండ్ నచ్చితే ఫాలో అయిపోండి. నచ్చకపోతే వదిలేయండి.

457
Tags

More News

VIRAL NEWS