ఆలోచింపజేసిన ఐడియా!


Sat,November 3, 2018 01:01 AM

దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన కాలుష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా.. స్పందించే అధికారులు కరువయ్యారు. మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో విపరీతమైన కాలుష్యం. దీంతో ఢిల్లీకి చెందిన ఓ గర్భిణీ పొల్యూషన్ ఫ్రీ ఢిల్లీ కోసం వినూత్నంగా ప్రచారం మొదలు పెట్టింది.
pregnancy
దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని ప్రధాన నగరాల్లో గాలి కాలుష్య సమస్య ప్రతియేటా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా దీపావళి సమయంలో గాలి, శబ్ద కాలుష్యం మరింత తీవ్రతరంగా ఉంటున్నది. దీంతో స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎంతోమంది ఆందోళనలు చేపడుతున్నారు. ఈ సమస్యపై ఢిల్లీకి చెందిన గర్భిణీ ఊర్వశి డగార్ వినూత్నంగా తన బాధను వ్యక్తం చేస్తున్నది. బాణాసంచా కాల్చడం వల్ల వెలువడే శబ్ద, గాలి కాలుష్యాలతో జీవరాశులన్నింటికీ హాని కలుగుతున్నదని వినూత్న నిరసన చేపట్టింది. అధికారుల్లో చలనం కలిగించేందుకు ముక్కుకు మాస్క్ ధరించి రోడ్లపైకి తన నిరసన తెలియజేస్తున్నది. తనకు పుట్టబోయే బిడ్డకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించాలని ప్రాధేయపడుతున్నది. సిద్ధార్థ్ మల్కానియా అనే ఫోటోగ్రాఫర్ ఊర్వశి ఆలోచనలను జనాలకు అర్థవంతంగా చెప్పేందుకు ఆమె కుమార్తెకు, ఆట బొమ్మలకు కూడా మాస్క్ ధరింపజేసి వినూత్నంగా కాలుష్య సమస్య గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత త్వరగా గాలి కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.

545
Tags

More News

VIRAL NEWS