పిగ్మెంటేషన్ సమస్యా?


Sat,May 12, 2018 12:29 AM

చర్మం రంగు ఎక్కువై నల్లమచ్చలు రావడాన్ని స్కిన్ పిగ్మెంటేషన్ అంటారు. పిల్లాగ్రా అనే జబ్బుతో చర్మం ఇలా రంగు మారుతుంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు కొన్ని చిట్కాలు..
Skin-Pigmentation
-చెంచాడు యాపిల్ సీడర్ వెనిగర్, రెండు చెంచాల నీరు కలిపి ముఖంపై మచ్చలున్న దగ్గర రాయాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుగాలి.
-రెండు చెంచాల శనగపిండి, చిటికెడు పసుపు, చెంచాడు రోజ్‌వాటర్, పాలు కలిపి సమస్య ఉన్నచోట రాయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
-ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్‌చేసి మచ్చలపై రుద్దాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుగాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ ప్రయత్నించొచ్చు.
-ఆలుగడ్డలను చిన్నముక్కలుగా కట్‌చేసి రసాన్ని తియ్యాలి. ఆ తాజా రసాన్ని ముఖం మీద మచ్చలపై రాయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడుగాలి. వారంలో 3 సార్లు ఇలా ప్రయత్నించొచ్చు.
-చెంచాడు శనగపిండి, తేనె, రెండు చెంచాల నిమ్మరసం, చిటికెడు పసుపును కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు ప్రయత్నించొచ్చు.

612
Tags

More News

VIRAL NEWS