మెరిసిపోండిలా!


Tue,October 16, 2018 01:05 AM

ముఖం మెరిసిపోవడానికి మార్కెట్లో దొరికే అన్ని ప్రాడక్ట్ వాడుంటారు. వాటివల్ల చర్మ సమస్యలను కూడా ఎదుర్కొనుంటారు. ఇంట్లో దొరికే ఇంగ్రిడియెంట్స్‌తోనే మెరిపోడానికి కొన్ని చిట్కాలు మీ కోసం.

skin-care
-ఓట్‌మీల్ పౌడర్, పెరుగు బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది.
-బాదం పొడిలో పెరుగు, తేనె, ఓట్‌మీల్ వేసి బాగా కలుపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. తరుచూ ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
-అరటిగుజ్జు, ఓట్‌మీల్ పౌడర్, రోజ్‌వాటర్, గ్లిజరిన్ నాలుగింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. రెండు వారాలకి ఒక్కసారి ఇలా చేస్తే ముఖం మెరుస్తుంటుంది.
-ఓట్‌మీల్ పౌడర్, గుడ్డు తెల్లసొన రెండింటినీ బాగా కలుపాలి. ఈ పేస్ట్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఐప్లె చేస్తే ముఖం అందంగా ఉంటుంది.

632
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles