ప్లాస్టిక్‌ను ఏరి పారేశారు!


Tue,August 7, 2018 11:26 PM

పర్యావరణం దెబ్బతినడానకి కారణం ప్లాస్టిక్ అని తెలిసినా నిత్యం వాడుతూనే ఉన్నారు. ప్లాస్టిక్‌ని వాడుకొని బయట పడేయడం వల్ల మట్టిలో పాతుకుపోయి జీవరాశి ప్రాణాలకే ముప్పు తెస్తున్నది. అయినా మనం నిర్లక్ష్యం వహిస్తాం. కానీ ముంబైకి చెందిన ఈ దంపతులు నలభైమంది విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ మీద యుద్ధమే ప్రకటించారు.
mahim-beach
ముంబై మహిమా బీచ్ ప్లాస్టిక్‌తో పేరుకుపోయింది. ఆ బీచ్‌లోనే చిన్నపిల్లలు ఆడుకోవడం, ఈత కొట్టడం లాంటివి చేస్తుండేవారు. నీటి కాలుష్యం, ప్లాస్టిక్ వల్ల వెలువడే వాయువుల కారణంగా అక్కడి ప్రజలు రోగాలతో బాధ పడుతుండేవారు. పరిస్థితిని గమనించిన ఇంద్రనీల్ సెంగుప్తా, రబియా తివారి దంపతులు ప్లాస్టిక్ మీద యుద్ధం ప్రకటించారు. ముంబైలో వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ పర్యావరణం కోసం సమయం వెచ్చించారు. మహిమ బీచ్‌ను పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్‌ను తొలగించాలనుకొన్నారు. కొన్నిరోజుల ఆఫీసు బాధ్యతలను పక్కనపెట్టి బీచ్‌లో చెత్త, ప్లాస్టిక్ కవర్లను తొలగించడం మొదలుపెట్టారు. ఇద్దరితో సాధ్యం కాదని అనుకొని ఇద్దరు వలెంటీర్‌లను పెట్టుకొన్నారు. ఇద్దరితో మొదలై ఐదుగురు చేరారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్, వాట్సప్‌లో షేర్ చేసారు.


mahim-beach2
విషయం తెలుసుకొన్న ఎంఈటీ రిషికుల్ విద్యాలయ విద్యార్థులు నలభై మంది ఈ ప్లాస్టిక్‌పై జరిగే సమరంలో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బీచ్‌లో ప్లాస్టిక్ తొలగించేవారు. ఇది చూసిన చాలామంది సమయం వృధా తప్ప.. పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు అంటూ హేళన చేశారు. వారి మాటలు పట్టించుకోకుండా తమ వంతు బాధ్యతను నిర్వర్తించేవారు. వరుసగా 46 వారాలు కష్టపడ్డారు. మొత్తం 500 టన్నుల ప్లాస్టిక్‌ను ఏరిపారేసారు. మళ్లీ చెత్త పోగు కాకుండా అసిస్టెంట్ కమీషనర్ అశోక్ జి కైర్నార్ సహాయంతో ఇంటింటికీ డస్ట్‌బిన్‌లు సైప్లె చేశారు.

625
Tags

More News

VIRAL NEWS