హ్యాకింగ్‌లకే కింగ్!


Sat,August 18, 2018 11:39 PM

మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం హ్యాకింగ్. అయితే, అమెరికాలో పిల్లలు ఈ హ్యాకింగ్‌లో సీనియర్ హ్యాకర్లకే గుండెనొప్పి తెప్పించేలా ఆరితేరారు. ఈ 11 యేండ్ల బ్రేవర్ అమెరికా సంయుక్త రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడంతో పాటు, కొత్తగా క్రియేట్ చేసి, తన సత్తా ఏంటో చూపించాడు.
brave-hacker
ఈ కుర్రోడి తెలివితేటలు అమోఘం. ఇతడి మేధస్సును చూసి టెక్నాలజీ నిపుణులు సైతం ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. ఎందుకంటే, దేశ రక్షణలో ఎంతో పటిష్టంగా ఉండే అమెరికాలోని ఐదు రాష్ర్టాల ఎన్నికల వెబ్‌సైట్లనే హ్యాక్ చేశాడు బ్రేవర్. అది కూడా నిమిషాల వ్యవధిలోనే. ఇందుకు ఎంతో పరిజ్ఞానం, సాంకేతిక అనుభవం ఉంటే తప్ప సాధ్య కాదని, ఈ బుడతడి తెలివితేటలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కుర్రోడి దెబ్బకి అమెరికా ఓటింగ్ సైట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో డెఫ్‌కాన్ సెక్యూరిటీ కన్వెన్షన్ పేరుతో మూడు రోజుల పాటు హ్యాకింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో 6-17 వయసున్న చిన్నారులు పాల్గొన్నారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుండడంతో పోటీల్లో పాల్గొన్న చిన్నారులు వారి ప్రతిభను ప్రదర్శించారు.

అందరికంటే టెక్సాస్‌కు చెందిన 11 యేండ్ల బాలుడు ఎమ్మెట్ బ్రేవర్ మాత్రం అసమాన ప్రతిభ ప్రదర్శించాడు. అమెరికా ఎన్నికల ఫలితాల వెబ్‌సైట్ లాంటి వెబ్‌సైట్లని కేవలం పది నిమిషాల్లో క్రియేట్ చేశాడు. ఫ్లోరిడా రాష్ట్ర ఎన్నికల విజేత పేరును కూడా మార్చేశాడు. అక్కడున్న చిన్నారులు మరో ఐదు అమెరికా రాష్ర్టాల ఎన్నికల వెబ్‌సైట్‌లను సులువుగా హ్యాక్ చేయడంతో పాటు, అలాంటి వెబ్‌సైట్స్‌నే క్రియేట్ చేయడంతో అమెరికా సైబర్ విభాగం ఆందోళనకు గురవుతున్నది. రాష్ట్ర ఎన్నికల డూప్లికేట్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేయడమే కాకుండా విజేతల పేర్లను కూడా మార్చాడు బ్రేవర్. వారికి వచ్చిన ఓట్ల సంఖ్యను బ్రేవర్‌కి ఇష్టమొచ్చినట్లు మార్చివేసి, వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసి, ఈ హ్యాకింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

606
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles