ఎలక్ట్రానిక్స్ జాతర


Tue,January 9, 2018 11:30 PM

ప్రతి ఏటా కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ (సీటీఏ) నిర్వహించే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో మంగళవారంమొదలైంది. ఈ నెల 12 వరకు జరుగనున్న ఈ ఎలక్ట్రానిక్స్ ప్రదర్శనలో మరికొన్ని రోజుల్లో మనకు అందుబాటులోకి వచ్చే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇతర పరికరాలు ఎన్నో ప్రదర్శనకు ఉంచారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడుతూ సరికొత్త ఫీచర్లో రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఆ జాతర పేరే.. సీఈఎస్ 2018.. ఆ జాతర విశేషాలివి..
CES
acer-swift-7

ఏసర్ స్విఫ్ట్7:

ఏసర్ కంపెనీ ఈ ఏడాది సరికొత్త ఆవిష్కరణతో ప్రారంభించనుంది. లండన్‌లో జరుగనున్న కన్జ్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ 2018)లో రెండు రకాల ల్యాప్‌టాప్‌లను విడుదల చేసి ప్రదర్శనకు ఉంచనున్నది. అందులో ఒకటి ఏసర్ స్విఫ్ట్7, మరొకటి నిట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ రెండింటిలో స్విఫ్ట్7 పేరుతో విడుదల చేస్తున్న ల్యాప్‌టాప్ ప్రపంచంలోకెల్లా అత్యంత పలుచనిది. ఈ ల్యాప్‌టాప్ వెడల్పు కేవలం 8.99 ఎం.ఎం మాత్రమే ఉంటుంది. 7 జనరేషన్ ఇంటెల్‌కోర్ ఐ 7 ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ రూపొందించబడింది. 256 ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ ఈ ల్యాప్‌టాప్ మెమరీ కెపాసిటీ. నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. సిమ్ టెక్నాలజీని పెంచుకోవచ్చు కూడా. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల ల్యాప్‌టాప్‌లకు స్విఫ్ట్7 గట్టీ పోటీ ఇస్తున్నది. సీఈఎస్‌లో విడుదల కానున్న ఈ లాప్‌టాప్ ఇండియాలో ఏప్రిల్ నెల నుంచి మార్కెట్లోకి వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను అన్నింటినీ ఒకే వేదిక మీద ప్రదర్శనకు ఉంచాలన్న కాన్సెప్ట్‌తో ప్రతి ఏటా ఈ సదస్సు నిర్వహిస్తుంటారు నిర్వాహకులు. ఎన్నో కొత్త ఆలోచనలకు ఒక వేదిక కల్పిస్తూ, నూతన ఆలోచనలను ప్రోత్సహిస్తూ గత యాభయేండ్లుగా ఈ సదస్సు నిర్వహిస్తున్నది కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్. లక్షా ఎనభై నాలుగు వేల మంది వీక్షకులు, 4వేల కంపెనీలకు సంబంధించిన స్టాల్స్, 1200 మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రస్తుత సదస్సులో ఆకట్టుకోనున్న కొన్ని గ్యాడ్జెట్స్ ఇవి.

samsung-curved

స్యామ్‌సంగ్ ఫుల్ కర్వ్‌డ్ మొబైల్:

కర్వ్‌డ్ డిస్‌ప్లేలతో మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టించిన స్యామ్‌సంగ్ మరో సరికొత్త ప్రయోగంతో త్వరలో మన ముందుకు రానున్నది. 180 డిగ్రీల ల్యాప్‌టాప్‌తో పాటు మొబైల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఫుల్ కర్వ్‌డ్ డిస్‌ప్లే పేటెంట్ కోసం వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఆఫీస్‌లో రిజిష్టర్ కూడా చేసుకుంది. ఈ సదస్సులో గెలాక్సీ ఎక్స్, గెలాక్సీ ఎస్9 మోడల్స్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసెసర్ల కంటే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో ఈ మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.
samsung-7-spin

స్యామ్‌సంగ్ నోట్‌బుక్7 స్పిన్:

మల్టీఫంక్షనల్ ల్యాప్‌టాప్‌తో స్యామ్‌సంగ్ ఈ సదస్సులో అడుగుపెట్టనున్నది. స్యామ్‌సంగ్ నోట్‌బుక్7కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ నోట్‌బుక్7 స్పిన్‌ని విడుదల చేస్తున్నారు. 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిప్పుకోగల వీలు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నది. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథెంటికేషన్ కూడా ఉన్నది.
artificial-intelligency

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ :

మనిషికి సంబంధం లేకుండా మనిషి మేధస్సుతో పోటీ పడి ప్రపంచంలో మనగలిగే కృత్రిమ మేధస్సు ఇప్పుడు వేగంగా రూపొందుతున్నది. అందులో భాగంగానే ఈ రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, చెప్తే ఆగిపోయే స్పీకర్లు, టీవీలు, తాళాలు ఇలా ఎన్నో వచ్చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎదురుగా ఎవరూ లేకపోయినా ఏదో ఒక యుద్ధం చేసిన ఫీలింగ్ కలిగేలా వచ్చిన వీఆర్ గేమ్స్ లాంటి ఎన్నో ఆవిష్కరణలు ఈ సీఈఎస్ 2018 వేదిక మీద గత యాభయేండ్లుగా పరిచయమవుతున్నాయి.
sony-xperia

సోనీ మొబైల్స్:

ఒకప్పుడు తన స్మార్ట్‌ఫోన్లతో మొబైల్ ప్రియులను కట్టిపడేసిన సోనీ ఈ సారి సీఈఎస్ 2018లో సరికొత్త మోడల్స్‌తో మూడు స్మార్ట్‌ఫోన్లను విడుదలకు సిద్ధం చేసింది. చక్కటి బ్యాటరీ సామర్థ్యంతో విడుదల చేయనున్న ఈ ఫోన్లకు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అమర్చారు. మీడియా టెక్ ప్రాసెసర్‌తో ఎక్స్‌ఏ2, ఎక్స్ ఏ2 అల్ట్రా, ఎల్2 మూడింటిలో కూడా ఆల్ట్రాక్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్ కూడా ఇందులో అమర్చింది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.
lg-tv-65

ఎల్‌జీ 4కే యూహెచ్‌డీ టీవీ:

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అప్లియన్సెస్‌లో జనాదరణ పొందిన ఎల్‌జీ ఈ సదస్సులో 65 అంగుళాల మడతబెట్టే ఓఎల్‌ఈడీ టీవీని విడుదల చేస్తున్నది. రెండేళ్ల క్రితమే 18 అంగుళాల ఓఎల్‌ఈడీ టీవీ విడుదల చేస్తామని ప్రకటించినా.. అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అంతకంటే పెద్ద సైజు టీవీనే విడుదల చేసి అబ్బుర పరిచింది. ఈ టీవీని ఎక్కడి కావాలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. పెద్దగా బరువు ఉండదు. ఈజీగా మడతబెట్టి బీరువాలో పెట్టుకోవచ్చు. బ్యాగులో పెట్టి ఊరికి తీసుకెళ్లవచ్చు. ఇందులో ఐపీఎస్ టెక్నాలజీ కూడా ఉంది. నానో కలర్, యూసిడ్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంచినట్టు ఎల్‌జీ ప్రకటించింది.
ces-2018

సీఈఎస్ తెరవెనుక..:

టెక్నాలజీ ప్రియులు ఇప్పటి వరకు చూడని సరికొత్త సాంకేతికతను సీఈఎస్ 2018 పరిచయం చేయనున్నది. 4జీ ఎంజాయ్ చేస్తున్న ఇంటర్‌నెట్ ప్రియుల కోసం 5జీ ట్రైలర్ చూపించనున్నది. 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లో పనిచేసే పరికరాల వేగాన్ని పరిచయం చేయనున్నది. ఇరవయేండ్ల క్రితం ప్రపంచం ఎలా ఉండేదో చూపిస్తూ.. ఇరువయేండ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టినట్టు చూడాలంటే లాస్‌వెగాస్‌లో జరిగే సీఈఎస్ 2018 ప్రదర్శనకు హాజరు కావల్సిందే!

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles