ఆత్మవిశ్వాసానికి మారుపేరు!


Sat,October 27, 2018 01:20 AM

కవల పిల్లలు పుడితే ఆ ఆనందమే వేరు. మరి ఇద్దరూ ఆడపిల్లలయితే! అయినా ఏం పర్వాలేదు. అబ్బాయికి ఏమీ తీసిపోమంటున్నారు వీరు. తల్లి నేర్పిన క్రమశిక్షణతో ముందుకు నడుస్తూ.. మధ్యలో ఆగిపోయిన వ్యాపారాన్ని మళ్లీ నడిపిస్తున్నారు.
twins
అహ్మదాబాద్‌కి చెందిన కవలలిద్దరూ ఆడపిల్లలే. వీరిని అంత తేలిగ్గా తీసెయ్యలేం. అమ్మాయిలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు అనడానికి వీరే నిదర్శనం. భార్యని కోల్పోయి వ్యాపారంలో ఒంటరిగా మిగిలిన తన తండ్రికి తోడుండి వ్యాపారాన్ని సజావుగా లాభాల బాట పట్టించారు. వీరి పేర్లు ధ్రువి, ధ్రుమి. తల్లిదండ్రులది ప్రేమ వివాహం. తండ్రి బొటిక్ నడుపుతుంటాడు. ఒకవైపు బొటిక్ పనులు చూస్తూనే పిల్లలను క్రమశిక్షణతో పెంచింది వీరి తల్లి. ఆమెకి కొంత సమయం దొరికినా పిల్లలతో సంతోషంగా గడిపేది. పిల్లలిద్దరూ తల్లిదండ్రుల వద్ద ఏ విషయాన్నీ దాచేవారు కాదు. స్కూల్స్, కాలేజీల్లో జరిగే నృత్యాలు, నాటకాలకి కావాల్సిన వస్ర్తాలను ధ్రువి తల్లి డిజైన్ చేసేది. ఒకరోజు ధ్రువి, ధ్రుమి నిద్రలేచేసరికి తల్లి కారు ప్రమాదంలో మరణించిందన్న వార్త వారిని కకావికలం చేసింది.

ఒక్కసారిగా వారి లోకం చీకటైంది. కొన్నిరోజులు గడిచిపోయాయి. అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఇద్దరూ మంచిగా చదువు కొనసాగించారు. తండ్రి ఆ బాధ నుంచి కోలుకోలేకపోవడంతో... వారే వ్యాపార బాధ్యతలు తీసుకున్నారు. దేవుడు ఒక బిజాల్‌ని తీసుకెళ్తే నీ దగ్గర ఇంకా ఇద్దరు బిజాలు ఉన్నారని మర్చిపోకు అని తండ్రికి ధైర్యం చెప్పారు. అప్పట్నుంచి తండ్రితో ఎక్కువ సమయం గడుపుతూ.. కష్టపడి పనిచేశారు. బిజాల్ ఫ్యాబ్రిక్ కల్చర్ బొటిక్‌గా పేరు మార్చి విజయవంతంగా నడిపిస్తున్నారు. భార్య లేకపోయినా కంటికి రెప్పల్లా చూసుకునే ఇద్దరి బిడ్డలు చాలు ఏమైనా సాధించొచ్చు అంటున్నాడు వీరి తండ్రి.

669
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles