‘వల’చినదానా!


Thu,April 20, 2017 11:40 PM

సమ్మర్ వచ్చేసింది అమ్మడు.. మరి ఏం చేస్తున్నారు? ముస్తాబు ముచ్చటేమిటి? పైగా పార్టీలు, ఫంక్షన్లు ఈకాలంలో బోలెడు.. ఇదిగో.. ఇలా అందరి మనసు దోచేయాలనుకుంటున్నారా?
సప్తవర్ణాల వలలతో భువికేగిన కన్యలా మెరిసిపోండి మరి. చిట్టి, పొట్టి గౌనులతో మీరే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారేందుకు.. నెట్ డ్రెస్‌ల కలెక్షన్‌తో ఈవారం మీ ముందుకొచ్చాం..
fashion
సాయంత్రం పార్టీలకు ఈ గౌన్ చాలా అందంగా ఉంటుంది. పైన మొత్తం రకరకాల సైజుల ముత్యాలను కుట్టాం. అంతేకాదు ఫ్లవర్ సీక్వెన్స్ చేశాం. కింద వైపు నెట్, శాటిన్‌లతో లేయర్లను కుట్టాం. దీంతో పక్కా వెస్ట్రన్ లుక్ వచ్చేసింది.

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడైనా అదిరిపోతుంది. తెల్లని నెట్‌ని లాంగ్ గౌన్‌గా డిజైన్ చేశాం. దాని మీద సీక్వెన్స్, బీట్స్ ఇచ్చాం. ఇక కింద వైపు ఇంపోర్టెడ్ లేసర్ కట్ ఫ్లవర్స్ ఇవ్వడంతో లుక్కే మారిపోయింది. ఇక లోపల తులిప్ స్కర్ట్‌కి బ్లాక్ సీక్వెన్స్ వర్క్ చేయించాం.

fashion1
లాంగ్ గౌన్ మెరుపులతో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవ్వొచ్చు. మూడు లేయర్లుగా ఈ గౌన్ డిజైన్ చేశాం. గోల్డ్ కలర్ నెట్ మీద లేసర్ కట్ ఫ్లవర్స్‌ని జత చేశాం. దాని కింద షైనీ నెట్ వాడాం. మరో లేయర్ కోసం సాటిన్ గోల్డ్ ఫ్యాబ్రిక్ ఎంచుకున్నాం. పైన గోల్డ్ కలర్ నెట్ మీద సీక్వెన్స్ వర్క్‌తో, స్లీవ్‌లెస్‌తో అదరగొట్టేశాం.

గులాబీ రంగులో ఆ గులాబీలా మెరిసిపోవాలంటే ఈ గౌన్ వేయాల్సిందే! పింక్ ప్లీటెడ్ నెట్ మీద ఒక వైపు పింక్ కలర్‌తోనే సీక్వెన్స్ వర్క్ చేయించాం. కింద వైపు శాటిన్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకున్నాం. లేయర్‌లా కనిపించేందుకు పింక్ కలర్ సాఫ్ట్ నెట్ తీసుకున్నాం. దానిమీద పీచ్ కలర్ లేసర్ కట్ ఫ్లవర్స్ యాడ్ చేశాం.

చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప అనిపించుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే. ఈ గౌన్ వేసుకుంటే బార్బీ డాల్‌లాగా అందంగా కనిపిస్తారు. పైన క్రీమ్‌కలర్ జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ చేసి హాఫ్ షోల్డర్ నెక్‌లా కుట్టాం. కింద బ్లాక్ కలర్ సెల్ఫ్ ప్రింట్ వచ్చిన నెట్‌ని వాడాం. మరింత అందంగా కనిపించేందుకు ఆటిక్ చిప్స్ వచ్చిన వెస్ట్ బెల్ట్‌ని వాడాం.
దీప్తి గణేష్
అంబర డిజైనర్ స్టూడియో
కూకట్ పల్లి, హైదరాబాద్
8142420088, 9848671986
www.facebook.com/
ambarastudio

656
Tags

More News

VIRAL NEWS