హోమియోతో పైల్స్ మాయం


Wed,May 4, 2016 01:57 AM

పైల్స్ ఉన్న వారి బాధ వర్ణనాతీతం. మల విసర్జన తర్వాత వీరి బాధ కొన్ని గంటల వరకు కూడా ఉంటుంది. నొప్పి మంట దురద లక్షణాలు ఉంటాయి. దీని వల్ల బాధ సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఈ మొలలు చిట్లడం వల్ల రక్తస్రావం జరుగుతుంది. కొంత మంది దీని గురించి ఎవరికీ చెప్పుకోరు. చాలా రోజుల పాటు రక్తస్రావం కొనసాగితే హిమోగ్లోబిన్ తగ్గి అనిమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వాహనాలు అధికంగా నడపడం, వేసవి కాలంలో నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య అధికమవుతుంది. గర్భిణి స్త్రీలలో, ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉన్న పురుషుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

కారణాలు
మల బద్ధకం, దీర్ఘకాలిక విరేచనాలు, గర్భస్థ శిశువు ఒత్తి చేయడం వల్ల, అధిక హార్మోన్ల వల్ల, ప్రసవ సమయంలో ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల, పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథి వాపు వల్ల మూత్ర విసర్జన సరిగ్గా జరగక పురీషనాళం మీద ఒత్తిడి పెరగడం వల్ల, పొత్తికడుపు లేదా పేగులలో క్యాన్సర్ వంటి కంతుల వల్ల, వంశపారంపర్యంగా, అధిక బరువు, హెమరాయిడ్ వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారిలో కూడా తరచుగా ఈ సమస్య కనిపిస్తుంది. ఆహారంలో పీచు పదార్థం తగినంత లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
Homeopathy

లక్షణాలు
చాలా మందిలో ఇంటర్నల్ హెమరాయిడ్‌లు ఉన్నపుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మలద్వారం తెరచుకున్నపుడు వెంటనే ఎర్రని తాజా రక్తం మలద్వారం ద్వారా వెలుపలికి వస్తుంది. మలద్వారం చుట్టూ దురద ఉండవచ్చు. మూడు నాలుగు దశలలో ఉన్న హెమరాయిడ్లు నొప్పి ఎక్కువగా ఉండి చీము వంటి పదార్థం విసర్జితమవుతుంది. మలద్వారం ద్వారా రక్తం రావడానికి ఇంకా హెమరాయిడ్‌లే కాకుండా ఇతర సమస్యలు కూడా కారణం కావచ్చు.

నిర్ధారణ
భౌతిక పరీక్ష, హెమరాయిడ్ అయితే చేతికి రక్తం అంటుకుంటుంది. లోపలి మెమరాయిడ్‌లు భౌతిక పరీక్షలో తెలియనప్పటికీ ఫీస్టూలా వంటి ఇతర సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. చికిత్స ప్రారంభించడానికి ముందు ఇతర సమస్యలేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం.

నివారణ
మొలలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లతో పాటు వారి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం అవసరం. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకు కూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీళ్లు తాగాలి. తగినంత వ్యాయామం తప్పనిసరి.

హోమియో చికిత్స
మొదటి మూడు దశలలోని హెమరాయిడ్‌లను పూర్తిగా నయం చేయడమే కాకుండా శస్త్రచికిత్స అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా హెమరాయిడ్ వల్ల వచ్చే బలహీనతను తగ్గించి శాశ్వతంగా రాకుండా చేస్తుంది. బాధించే తక్షణ లక్షణాలను తగ్గించుటకు కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. బాధించే లక్షణములతో పాటుగా శారీరక మానసిక వ్యక్తిత్వ లక్షణాలతో మందుల ఎంపిక జరుగుట వల్ల వంశపారంపర్యంగా వచ్చే బలహీనతను కూడా సరిచేస్తుంది.
ఆస్‌కులస్ హిప్, ఆలీస్, హెమాములస్, కొలింగ్ సానియా, ఆర్సనిక్ ఆల్, నక్స్ వామిక మందులు బాగా పనిచేస్తాయి.
murali

1905
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles