హోమియోతో పైల్స్‌కి చెక్


Mon,April 27, 2015 12:25 AM

piles


శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా నరకయాతనకు గురిచేసే సమస్యల్లో పైల్స్ ఒకటి. రక్తహీనతకు కూడా కారణమయ్యే ఈ సమస్య మలద్వారంలో రక్తనాళాలు ఉబ్బడం వల్ల వస్తుంది. మలద్వారం లోపల ఏర్పడే అర్శమొలల వల్ల నొప్పి అంతగా ఉండదు. మలవిసర్జన సమయంలో కొన్నిసార్లు రక్తస్రావం జరుగుతుంది. మలద్వారం గుండా రక్తనాళాలు బయటకు రావచ్చు కూడా. వీటిని తిరిగి లోపలకు నెట్టకపోతే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మలద్వారం చుట్టూ చర్మంపై బొడిపల్లా ఏర్పడే పైల్స్ రెండోరకం. ఇవి పగిలినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుంది.

ఆనల్ ఫిషర్


మలద్వారం దగ్గర చీలిక ఏర్పడడాన్ని ఆనల్ ఫిషర్ అంటారు. ఈ చీలికలో చీము తయారవుతుంది. తర్వాత అల్సర్‌గా మారి దురద, నొప్పి, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం మలబద్దకం ఉండడం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి మలద్వారం చీరుకుపోయి అల్సర్ తయారవుతుంది. మలబద్దకం ఉన్నప్పుడు మలవిసర్జన గట్టిగా అవడం వల్ల ఈ అవకాశం ఉంది. విరేచనాల వల్ల ఎక్కువసార్లు కడగడం వల్ల మలద్వారం ఉబ్బిపోతుంది. సాధారణంగా యుక్త, మధ్య వయస్కుల్లో ఇది ఎక్కువ.

ఫిస్టులా


మలద్వారం దగ్గర ఇన్‌ఫెక్షన్ల కారణంగా కత్తి కోత లాంటి పగులు ఏర్పడుతుంది. దీనిలో నుంచి ద్రవాలు బయటకు వస్తాయి. తీవ్రమైన నొప్పి ఉంటుంది. కూర్చోలేరు. దురద, రక్తస్రావం ఉంటాయి.

కారణాలు


హెమరాయిడ్స్ (పైల్స్) వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేసేవారిలో, స్థూలకాయులు, మలబద్దకంతో బాధపడేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. బరువైన వస్తువులను ఎత్తడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, అతిగా మద్యపానం చేయడం, అవసరమున్నా లేకపోయినా టాయిలెట్‌పై ఎక్కువ సేపు గడపడం పైల్స్ అవకాశాన్ని పెంచుతాయి. గర్భిణుల్లో డెలివరీ సమయంలో ఈ సమస్య కనిపించొచ్చు. వృద్దాప్యం, డయేరియా కూడా ఇందుకు దోహదపడతాయి.

గ్రేడ్లు...


పైల్స్ పొజిషన్‌ని బట్టి వాటిని గ్రేడ్ల వారీగా విభజిస్తారు. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడితే గ్రేడ్-I అంటారు. బయటి నుంచి ఈ వాపు కనబడదు. మలవిసర్జన సమయంలో రక్తనాళాలు బయటకు వచ్చి, వాటంతటవే లోపలకు వెళ్లిపోతే దాన్ని గ్రేడ్ II అంటారు. ఉబ్బిపోయిన రక్తనాళాలు మలవిసర్జన సమయంలో వెలుపలికి రావడం, వేళ్లతో తోస్తేనే లోపలకు పోతే గ్రేడ్ III అంటారు. వెలుపలికి వచ్చిన రక్తనాళాలు లోపలికి తోసినా బయటే ఉండిపోతే గ్రేడ్ IV అంటారు.

raj


హోమియో చికిత్స


నొప్పి, వాపు, దురద, రక్తస్రావం వంటి వ్యాధి లక్షణాలను అదుపు చేయడంలో హోమియో మంచి ఫలితాలను ఇస్తుంది. వీటి మూలంగా వచ్చే నొప్పిని భరించలేక కొంతమంది ఆపరేషన్‌కు సిద్ధపడుతుంటారు. కానీ దీనివల్ల ఉపశమనం తాత్కాలికమే. హోమియో చికిత్స ద్వారా సమూలంగా తగ్గించవచ్చు. మూలకారణాన్ని ఇవి తొలగిస్తాయి. మళ్లీ తిరగబెట్టకుండా పనిచేస్తాయి. గ్రేడ్1, 2 రకాలు హోమియోతో పూర్తిగా తగ్గిపోతాయి. గ్రేడ్ 3 ఉంటే లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రయోనియా, లైకోపోడియం, సల్ఫర్, కాల్సెరియా ఫ్లోర్, ఆర్సెనిక్ ఆల్బమ్ వంటి మందులు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి.

2219
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles