హైబీపీ లక్షణాలివే


Tue,March 5, 2019 01:01 AM

హైబీపీ మనకెంత ప్రమాదమో.. పక్కవాళ్లకూ అంతే ప్రమాదం. హైబీపీ ఉన్నవాళ్లకు గుండె వ్యాధులూ రావచ్చు. మీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే హైబీపీ ఉన్నట్లే.
high-bp
హైబీపీ ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నీరసంగా ఉంటుంది. చూపు కాస్త మసకగా ఉంటుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. తీవ్ర ఆందోళన.. గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం.. తలనొప్పి.. ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక బరువు ఉన్నవారికి హైబీపీ తొందరగా వస్తుంది. కాబట్టి శరీర బరువు తగ్గాలి. బీఎంఐ 20-25 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. బీఎంఐ 25 దాటితే హైబీపీ రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించి హైబీపీ లేకుండా చూసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల గుండె కండరాలు ధృడంగా మారి హైబీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

255
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles