హైటెక్ రుబిక్ క్యూబ్!


Sat,October 6, 2018 11:07 PM

పిల్లలకే కాదు పెద్దలకూ టైమ్ పాస్ గేమ్ రుబిక్ క్యూబ్. దాన్ని సెట్ చేయాలంటే తంటాలు పడక తప్పదు. కానీ, సులువుగా ఆ క్యూబ్‌ని సాల్వ్ చేయగలిగే టెక్నాలజీ వచ్చేసింది తెలుసా?
Rubik-cube
రుబిక్ క్యూబ్ సాల్వ్ చేస్తుంటే అస్సలు టైమ్ తెలియదు. పూర్తి చేసేంతవరకు వదిలేయాలని, మరో పని చేయాలని కానీ తోచదు. ఎంత ప్రయత్నించినా సెట్ కాకపోతే మాత్రం ఎక్కడలేని విసుగు వచ్చేస్తుంది. ఆ కోపం ఇతరుల మీద చూపిస్తాం. ఇకమీదట అంత కష్టపడాల్సిన పనిలేదంటున్నారు రుబిక్ క్యూబ్ సీఈఓ ఉడి డోర్. ప్రపంచంలో ఉన్న టాయ్స్ అన్నింటిలో రుబిక్ క్యూబ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. 44 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 350 మిలియన్ల రుబిక్ క్యూబ్‌లు అమ్ముడుపోయాయంట. రుబిక్ క్యూబ్ సీఈఓనే హైటెక్ రుబిక్ క్యూబ్ తయారు చేశారు.


మొబైల్‌లో రుబిక్ క్యూబ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెన్సార్ క్యూబ్‌ను మొబైల్‌కి కనెక్ట్ చేయాలి. మొబైల్‌లో ప్లే అవుతున్న విధంగానే బయట 54 చిన్న క్యూబ్స్ సెట్ అవుతుంటాయి. దాన్ని చూస్తూ రుబిక్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో సులువుగా నేర్చుకోవచ్చు. దీన్ని బ్లూ టూత్‌తో కూడా మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. సెన్సర్స్ ఉండే చాలా క్యూబ్స్ మొబైల్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఈ రకమైన ఐకానిక్ క్యూబ్‌ను 2019 ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నారు. దీని ధర రూ. 5,080 నుంచి మొదలవుతున్నది.

729
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles