హెపటైటిస్, హెచ్‌ఎస్‌వీలకు ఇక చెక్


Tue,May 31, 2016 11:16 PM

లైంగిక అవయవాలపై ప్రభావం చూపే వ్యాధి హెర్పస్ సింప్లెక్ అయితే కామెర్లు లక్షణంగా కనిపించే హెపటైటిస్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే వ్యాధి. కాలేయాన్ని దెబ్బతీసే ఈ వ్యాధిలో అయిదు రకాలున్నాయి. వీటిలో హెపటైటిస్ బి, సి ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏటా 6 నుంచి 10 లక్షల మంది హెపటైటిస్ బి, సి వ్యాధుల వల్ల మృత్యువాత పడుతున్నారు. మన దేశంలో 2010 లెక్కల ప్రకారం 40 నుంచి 80 మిలియన్ల మంది హెపటైటిస్ బి, సి వ్యాధిగ్రస్థులున్నారని అంచనా. వీటిలో హెపటైటిస్ బి గానీ, హెర్పస్ సింప్లెక్ గానీ రాకుండా నివారించడానికి కనీసం వ్యాక్సిన్ అయినా అందుబాటులో ఉంది. కానీ హెపటైటిస్ సి విషయంలో ఆ అవకాశం కూడా లేదు. ఏదిఏమైనా ఈ జబ్బులను తగ్గించడానికి హోమియోపతిలో మేలైన చికిత్స ఉంది.

చాప కింద నీరులా...


హెపటైటిస్ బి వ్యాధి చాలా ఆలస్యంగా బయటపడుతుంది. కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరువాత కూడా వ్యాధి బయటపడవచ్చు. వైరస్‌కి పరిసరాలు సహకరించేంతవరకు అది వేచి ఉంటుంది. ఆ తరువాతే అది దాడి చేస్తుంది. కొందరిలో వైరస్ సోకిన 4 నుంచి 12 వారాల తరువాత కూడా వ్యాధి లక్షణాలు బయటపడతాయి. హెపటైటిస్ బి, సి వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. ఇవి కాలేయంపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనేంత వరకు ఈ వ్యాధులు సోకాయో లేదో అన్న విషయం రోగికి కూడా తెలియదు. రక్తపరీక్ష చేసినప్పుడో లేదా శస్త్రచికిత్స చేసే ముందో ఈ వ్యాధులు సోకినట్లు హఠాత్తుగా బయటపడుతుంది.

హెర్పస్ సింప్లెక్స్


హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధి ఇది. ప్రధానంగా శృంగారం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాధి తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం, ఒళ్లంతా నొప్పులు, చంకల్లో గడ్డలు కట్టినట్టుగా ఉండటం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. తరువాత దశ వ్యాప్తి దశ (స్ప్రెడింగ్ ఫేజ్). దీనిలో లైంగిక భాగాలపై చిన్న చిన్న నీటి పొక్కులు కనిపిస్తాయి. రెండు మూడు రోజుల్లో అవి పగిలి పుండ్లలాగా తయారవుతాయి. ఈ సమయంలో వచ్చే చీము లాంటి ద్రవం ద్వారా కూడా హెర్పస్ సింప్లెక్స్ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా శృంగార సమయంలో ఇది త్వరగా వ్యాపిస్తుంది. అంటే పుండ్ల వల్ల మాత్రమే కాకుండా భాగస్వామికి వ్యాధి ఉన్నా చాలు. వీళ్లకీ వస్తుంది.
ఇది ముదిరితే మహిళల్లో సమస్య ఎక్కుగా ఉంటుంది. నాడుల సమస్యలు, ఒళ్లంతా మంట ఉంటాయి. గర్భిణుల్లో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. పురుషుల్లో అయితే అంగ స్తంభన సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు కనబడతాయి. హెచ్‌ఐవీ ఉన్నవారు హెర్పస్ వ్యాధితో మరింత ఎక్కువగా బాధపడతారు.

గుర్తించడం ఎలా?


హెపటైటిస్ బి, సి వ్యాధులను నిర్ధారిచేందుకు హెచ్‌బీఎస్ ఏజీ అనే పరీక్ష, హెపటైటిస్ సి వ్యాధిని గుర్తించడానికి ప్రత్యేకంగా హెచ్‌సీవీ యాంటీబాడీ ఎంజైమ్ ఇమ్యూనరీ, హెపటైటిస్ బి, సి వైరల్ లోడ్ ద్వారా గానీ, పీసీఆర్ టెస్ట్ ద్వారా గానీ కనుక్కోవచ్చు. వీటితో పాటు అవసరాన్ని బట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్, ఈఎస్‌ఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. ఇక హెచ్‌ఎస్‌వీని వ్యాధి లక్షణాల ద్వారానే చాలావరకు గుర్తుపట్టవచ్చు. లేదా హెచ్‌ఎస్‌వీ 1, 2 పరీక్షలు, IgG, IgM పరీక్షల ద్వారా హెర్పస్ సింప్లెక్స్ వైరస్‌ను నిర్ధారణ చేయవచ్చు.

పరిష్కారం..


హోమియోపతి వైద్యవిధానం ప్రథమ లక్షణం మనిషి సమతుల్యతను తిరిగి ఒక గాడిలో పెట్టడం. సమతుల్యత దెబ్బతినకుండా కాపాడటం. ఇది రోగనిరోధక శక్తి మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందువల్ల ఇలాంటి లైంగిక వ్యాధులతో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోకుండా ఆపుతాయి హోమియో మందులు.
ravikiran
హెపటైటిస్ బి, సి వైరస్‌లు కాలేయంలో పెరుగుతాయి. దీన్ని రెప్లికేషన్ అంటారు. ఈ రెప్లికేషన్ ప్రక్రియను హోమియో మందులు వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా సమర్థవంతంగా అడ్డుకుంటాయి. తద్వారా వైరస్‌ల సంఖ్య (వైరల్ లోడ్) తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ వైరల్ లోడ్‌ను అడ్డుకోవడానికి హోమియోమందులు పరోక్షంగా సహకరిస్తాయి. అప్పటికే ఉన్న వైరస్ ఎదగకుండా చేస్తాయి. హోమియోపతి క్లాసికల్ విధానం ద్వారానే దీన్ని ఎదుర్కోగలుగుతాము. లైకోపోడియం, హెపర్ సల్ఫ్, మెర్క్‌సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు హెపటైటిస్‌ను కంట్రోల్ చేస్తాయి. హెచ్‌ఎస్‌వీని కూడా పూర్తిస్థాయిలో అరికట్టడం హోమియోపతి ద్వారా సుసాధ్యం అవుతుంది.

1831
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles